ట్రోలర్స్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన వీకే. నరేష్..!
వీకే నరేష్ మాట్లాడుతూ.. నా జీవితం నా ఇష్టం నేను ఎలా బతకాలి? ఏం మాట్లాడాలి అనేది నా వ్యక్తిగత విషయమని,మీకు నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే ట్రోల్స్ చేసుకోండి. వాటి వల్ల నాకే నష్టం ఉండదు, నాకు పోయేదేమీ ఉండదు అంటూ తెలిపారు ట్రోల్స్ వల్ల తన పైన ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ పడదంటూ తెలియజేశారు. తాను ఎవరి వలన మారే ప్రసక్తి లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతానికి తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ తెలిపారు వీకే నరేష్. సినిమా కోసం కష్టపడతాను ,కెమెరా ముందు నటిస్తాను కెమెరా వెనుక నా ప్రైవసీ నాది అంట వెల్లడించారు.
ఇటీవల 54వ పుట్టినరోజు వేడుకలలో పవిత్ర లోకేష్ తో కలిసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు వీకే నరేష్. దీంతో చాలానే విమర్శలు కూడా వినిపించాయి. ఈ విషయం పైన ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు వికే.నరేష్. హే బలవంత్ సినిమా ప్రమోషన్స్ లో నరేష్ చేసిన కామెంట్స్ ధైర్యంగా చెప్పడంతో కొంతమంది సపోర్ట్ చేయగా, మరి కొంతమంది కాస్త తగ్గి నడుచుకుంటే మంచిది అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ నరేష్ తన మీద వచ్చిన నెగెటివిటీని పాజిటివ్‌గా మార్చుకుంటానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.