సన్రైజర్స్ ఆటతీరుఫై.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళు ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో వీర బాదుడు  బాదేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బ్యాటింగ్లో పెద్దగా సత్తా చాటు లేకపోయినా సన్రైజర్స్.. ఈసారి మాత్రం అదరగొడుతుంది. ఏకంగా ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వెనుక పుట్టించే విధంగా ప్రస్తుతం సన్రైజర్స్ బ్యాట్స్మెన్ల విధ్వంసం కొనసాగుతుంది అని చెప్పాలి. ఏకంగా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టింది. మొదట అటు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసింది సన్రైజర్స్. దీంతో ఇక ఇదే ipl హిస్టరీలో అత్యధిక స్కోరుగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే ఇక ఈ స్కోరును బద్దలు కొట్టడం కష్టమే అని అందరూ అనుకుంటున్నా వేళ.. మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈ అత్యధిక స్కోరును బద్దలు కొట్టి 287 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ జట్టు ఆట తీరు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఏదో ఒక మ్యాచ్ లో 300 స్కోర్ చేయడం ఖాయం అని అభిమానులు కూడా అనుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా టీ20 ఫార్మాట్లో ఇంత భారీ స్కోర్ నమోదు చేయడంపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఐపిఎల్ టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సృష్టిస్తున్న విధ్వంసం పై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం  వసీం అక్రమ్ సైతం ఆశ్చర్య వ్యక్తం చేశారు.


 టి20 ఫార్మాట్లో ఎప్పుడూ చూడని విధంగా నమ్మశక్యం కాని స్థాయిలో హైదరాబాద్ జట్టు ఆడుతోంది అంటూ వసీం అక్రమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నేను ఈ తరంలో క్రికెట్ ఆడనందుకు దేవుడికి థాంక్స్ చెబుతున్నా. 20 ఓవర్లలో 270 పరుగులా.. వన్డే ఫార్మాట్లో ఇది 500 తో సమానం. పైగా పలుమార్లు ఇదే రీతిలో బాదేశారు ఆ జట్టు ఆటగాళ్లు. తొలి ఐదోవర్లలో వంద పరుగులు చేయడం అంటే ఇది నిజంగా అన్యాయం అని చెప్పాలి. అన్ని ఫుల్ టాస్ బంతులు వేసిన కూడా ఆ రేంజ్ లో స్కోర్లు చేయడం అసాధ్యం. సన్రైజర్స్ ఆట తీరు నన్ను విస్మయానికి గురి చేసింది అంటూ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: