సీమలో టీడీపీని తొక్కుకుంటూ పోతున్న వైసీపీ.. 40 స్థానాల్లో వైసీపీకే ఛాన్స్ కానీ?

Reddy P Rajasekhar
రాయలసీమలో కూటమి, వైసీపీలలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయనే ప్రశ్నకు వైసీపీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాల్లోని 90 శాతం స్థానాలలో వైసీపీ జోరు కొనసాగనుంది. మెజారిటీ నియోజకవర్గాలలో వార్ వన్ సైడ్ అని ఓటర్లు ఫిక్స్ అయ్యారు. ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపూర్ జిల్లాల్లో సైతం 80 శాతం నియోజకవర్గాల్లో వైసీపీకే అనుకూల పరిస్థితులున్నాయి.
 
హిందూపురం, కుప్పం, నగరి నియోజకవర్గాలు కూటమికి అనుకూలంగా ఉండటం గమనార్హం. మైదుకూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే విజేతగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సీమలో వైసీపీ కూటమిని తొక్కుకుంటూ పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 88 స్థానాలలో విజయం సాధించాల్సి ఉంటుంది.
 
రాయలసీమ నుంచి 40 నుంచి 45 స్థానాలలో విజయం దక్కుతుందని వైసీపీ భావిస్తుండటం గమనార్హం. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో సైతం తమ పార్టీదే హవా హవా ఉంటుందని మిగతా జిల్లాలలో కనీసం 50 శాతం స్థానాలలో విజయం దక్కుతుందని ఈ పార్టీ భావిస్తోంది. అయితే కూటమి నేతలకు సైతం ఏపీలో అధికారం విషయంలో సొంత లెక్కలు ఉన్నాయి.
 
ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందో కూటమి అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది. ఎన్నికలకు కేవలం రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో జగన్ ప్రచారం విషయంలో మరింత వేగం పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పోలిస్తే సీఎం జగన్ ప్రచారానికి సంబంధించి సరైన దారిలో నడుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు రోజుల్లో జగన్  వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మేనిఫెస్టోలో రుణమాఫీ లాంటి హామీలు ఉంటే మాత్రం వైసీపీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: