ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆ స్టార్స్.....!!

murali krishna
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఏది చెప్పాలన్నా సరే సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి సోషల్ మీడియా యాప్లలో ఇన్స్టా గ్రామ్‌ది వెరేలెవల్‌.
అయితే ఈ ఇన్స్టాగ్రామ్లో టాలీవుడ్ హీరోలకు ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరో అల్లు అర్జున్. ఆయన ఇటీవల పుష్ప సినిమాలో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దేవీ శ్రీ మ్యూజిక్, హీరోయిన్ రష్మిక ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. ఇక సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో లాక్డౌన్ సమయం నుంచి యాక్టివ్గా మారారు. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 19.3 మిలియన్ క్రాస్ చేసింది.
ఆ తర్వాత అదే రేంజ్లో ఉన్న హీరో రౌడీ బాయ్ విజయదేవరకొండ. ఇటీవల లైగర్తో ముందుకొచ్చిన ఈ హీరో.. ఆ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. పూరీ – చార్మి – కరణ్ కాంబోలో వచ్చిన ఈ బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇటీవల ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ హీరోకి హిట్టు లేకపోయినా… ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య మాత్రం బాగానే ఉంది. ఆయనకు దాదాపు 17.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక సూపర్ స్టార్ మహేశ్బాబుకు కూడా ఇన్స్టాలో ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఈయన రేంజ్ మాత్రం తగ్గట్లేదు. మహేశ్ ఇటీవల సర్కారి వారి పాట చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈయన ఫాలోవర్స్… 8.8 మిలియన్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాహుబలి సిరిస్తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన సాహో పర్వలేదనిపించినా… రాదేశ్యామ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేపోయింది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నారు. ఇంకా సందీప్ వంగా, మారుతీ దర్శకత్వంలో కూడా మూవీస్ చేయనున్నారు. ఇక ప్రభాస్ ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య 8.8. ప్రభాస్ కేవలం సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంటారు.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్కు అభిమానులు ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ను అల్లూరి గెటప్లో చూసి ఫ్యాన్స్ పూనకాలు తెచ్చుకున్నారు. ఇక ఈయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఇన్స్టా ఫాలోవర్స్ 8.4 మిలియన్స్.
నేచురల్ స్టార్ నాని ఇటీవల శ్యామ్ సింగరాయ్తో హిట్ కొట్టాడు. ఆయన ప్రస్తుతం ఫాలోవర్స్ 5.3 ఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు 4.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక బాహుబలిలో బళ్లాల దేవుడిగా మెప్పించిన రానాకు 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు 2.9, అఖిల్కు 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: