నాగార్జునతో కలిసి అస్సలు నటించను.. అమల సంచలన వ్యాఖ్యలు..!!

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే  అమల నాగార్జున జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది అనే చెప్పాలి. అయితే సినిమాల్లో కలిసి నటించిన ఈ జోడీ రియల్ లైఫ్ లో కూడా క్యూట్ కపుల్ గా పేరును సంపాదించుకోవడం గమనార్హం.ఇదిలావుంటే ఇక అమల సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక  నాగార్జున అమల కలిసి నటించాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు.ఇటీవల  ఒకే ఒక జీవితం సినిమాలో అమల పోషించిన పాత్ర ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే  ఇక నాగార్జున అమల కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇక అమల మాత్రం నాగార్జునతో కలిసి నటించే ఉద్దేశం లేదని వెల్లడించడం గమనార్హం. ఇకపోతే ఒకే ఒక జీవితం సక్సెస్ మీట్ లో మాట్లాడిన అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత హిందీలో మూడు సినిమాలు, మలయాళంలో రెండు సినిమాలు ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశానని అన్నారు.అయితే  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత తెలుగులో నేను నటించిన సినిమా ఒకే ఒక జీవితం అని అమల కామెంట్లు చేశారు.అంతేకాదు గడిచిన కొన్ని సంవత్సరాలుగా నేను అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియాను చూసుకుంటున్నానని ఆమె అన్నారు.

అంతేకాదు నాపై వందల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక నా సమయాన్ని ఆ విద్యార్థుల కోసమే కేటాయిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.అయితే  నేను వరుసగా సినిమాలు చేస్తే ఆ బాధ్యతలకు దూరం కావాల్సి ఉంటుందని అమల అన్నారు. నా మనసుకు హత్తుకునే కథలు, పాత్రలతో ఉన్న సినిమాలు వస్తే మాత్రమే చేస్తానని అమల కామెంట్లు చేశారు.అయితే నాగార్జున గారితో కలిసి సినిమా చేస్తారా అనే ప్రశ్నకు అమల స్పందిస్తూ నేను, నాగార్జున ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటామని మళ్లీ స్క్రీన్ పై వద్దని నాగార్జునతో కలిసి సినిమా చేసే ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఇక అమల వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: