రష్మిక మైసా గ్లింప్స్ సూపర్.. రౌడీ హీరోకి పోటీ ఇస్తుందా..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం మైసా.  లేడీ ఓరియంటెడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు డైరెక్టర్ హనురాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలాంటి డైరెక్టర్ రవీంద్ర ఇప్పుడు ఏకంగా రష్మికతోనే పాన్ ఇండియా సినిమాగా మైసా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది.

మైసా గ్లింప్స్ విషయానికి వస్తే.. అగ్నికి ఆహుతైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నట్టు రష్మిక కనిపిస్తోంది. అలాగే ఒక చేతిలో సంకెళ్లు మరొక చేతిలో కత్తి పట్టుకొని మరీ కనిపిస్తోంది. "నా బిడ్డ సచ్చిందన్నారు, కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాచలేక గాలే ఆగిపోయింది, నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదయ్యింది.. మండుతున్న నా బిడ్డను చూడలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది. నా బిడ్డను చంపలేక"  అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా ఉంది. అలాగే రష్మిక తుపాకీతో రౌడీలను కాలుస్తూ ఉన్నట్టు చూపించారు.ముఖ్యంగా ఇందులో రష్మికను చూపించిన తీరు కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయేలా కనిపిస్తోంది.

అటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇటీవల నటించిన రౌడీ జనార్దన్ చిత్రంలో కూడా విభిన్నమైన పాత్రలో కనిపించారు. ఇప్పటివరకు విజయ్ కెరియర్ లోనే కనిపించని పాత్రలో కత్తి పట్టుకొని మరీ కనిపించారు. దీంతో ఈ విషయంపై అటు ఇద్దరు అభిమానులు కూడా ఏంటి విజయ్ కి రష్మిక పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతమైతే మైసా సినిమా గ్లింప్స్ వైరల్ గా మారింది. మరి ఈ సినిమా రష్మికకు ఇంకెలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: