ఈ ఏడాది రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ కంటే ఎక్కువ జనాభా తలచుకున్న డైరెక్టర్ ఇతడే..!
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా?ఆయన మరెవరో కాదు… తనదైన కామెడీ టైమింగ్‌తో, ఎంటర్టైనింగ్ నెరేషన్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనిల్ రావిపూడి.ఈ ఏడాది ప్రారంభంలోనే “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎంటర్టైనర్గా ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, అనిల్ రావిపూడి మార్కెట్ మరింత పెరిగిపోయింది.
ఆ సినిమా విజయం తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే భారీ ఛాన్స్‌ను కొట్టేశారు. ఇది ఆయన కెరీర్లో మరో కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా పూజా కార్యక్రమం జరిగిన రోజే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, ఒక్కొక్కటిగా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు.హీరోయిన్గా నయనతారను ఎంపిక చేయడం ఒక పెద్ద సర్ప్రైజ్గా మారింది. ఆ తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలా ఒక్కో అప్డేట్, ఒక్కో వీడియో రిలీజ్ చేస్తూ, ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా గురించి ఏడాది పొడవునా సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ రచ్చ చేశారు.
ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.ఈ మొత్తం పరిణామాలను చూస్తే, ఈ ఏడాది మొత్తం స్టార్ డైరెక్టర్లందరినీ మించి అనిల్ రావిపూడి పేరు ఎక్కువగా ట్రెండ్ అయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తన సినిమాలు, తన ప్రమోషన్ స్ట్రాటజీలు, తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో అనిల్ రావిపూడి 2025 సంవత్సరాన్ని పూర్తిగా తనదిగా మార్చుకున్నాడని చెప్పవచ్చు.