ఈయన చూస్తే అంత టాలెంటెడ్ గా ఏమీ కనిపించడు. కానీ ఎంత టాలెంటో తెలియాలంటే కచ్చితంగా అతని ప్రతిభ ఏంటో బయటకు రావాలి. చూస్తే బక్కోడే కానీ సీనియర్ల కంటే ఏమి తక్కువ కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో సీనియర్లు కూడా ఈయన మ్యూజిక్ కి తట్టుకోలేక పోయారు. ఇక ఆయన ఎవరంటే అనిరుధ్ రవి చందర్.. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఒకప్పుడు కోలీవుడ్ సినిమాలకే మ్యూజిక్ అందించేవారు. కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఈయనకు గిరాకీ బాగానే పెరిగిపోయింది. అలా అనిరుధ్ రవి చందర్ ఈ ఏడాది కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఆ సినిమాలు ఏంటి.. ఆయన చేతిలో ప్రస్తుతం ఎన్ని సినిమాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుష్ హీరోగా నటించిన త్రీ మూవీ లోని వై దిస్ కొలవెరి ఢీ అనే పాటతో ఫేమస్ అయినా అనిరుధ్ రవిచందర్ ఆ తర్వాత కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకున్నారు. ఇక అనిరుధ్ ఈ ఏడాది కింగ్డమ్, కూలీ, విడాముయర్చి, మదరాసి వంటి సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇందులో కొన్ని కథపరంగా ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా కింగ్డమ్, కూలీ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచినప్పటికీ ఈ సినిమాలోని మ్యూజిక్ మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మరీ ముఖ్యంగా 2025లో హిట్ అయిన సాంగ్స్ లో కూలి మూవీలోని మోనికా సాంగ్..ఈ పాట ఇంటర్నేషనల్ లెవెల్ లో వైరల్ అయింది. ఇక మదరాసి మూవీ ఫ్లాప్ అయినప్పటికీ సంగీతం మాత్రం ఆకట్టుకుంది.
అలాగే అజిత్ హీరోగా నటించిన విడాముయర్చి మూవీ కూడా కథపరంగా మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంది. ఇక అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.ఆయన ఇచ్చే సంగీతానికి ఎవరైనా సరే ఆకర్షితులు కావాల్సిందే. ఇక ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈయన ఒకేసారి ఏకంగా తొమ్మిది సినిమాలకు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ప్రస్తుత అనిరుధ్ రవిచందర్ ఖాతాలో దేవర 2, విక్రమ్ 3, జైలర్ -2,ఇండియన్ -3, జననాయగన్, ది ప్యారడైజ్, టాక్సిక్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన LIK మూవీకి కూడా అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.