SSMB 29: ఇండియన్ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని కథ?

Purushottham Vinay
ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మహేష్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో నిన్ననే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుందనే విషయాన్ని రాజమౌళి వెల్లడించారు.మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే చిత్రం ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయమి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. 


మహేష్ బాబుతో చేయబోయే సినిమాను భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.మహేష్ బాబు, రాజమౌళి చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.ప్రస్తుతం రాజమౌళి తన పూర్తి సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చారు.


రాజమౌళితో సినిమా చేస్తే అది ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి మామూలు సినిమాలు చేయడం లేదు.ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్‌  మూవీ 'ఇండియానా జోన్స్ తరహాలో ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాదు దక్షిణాఫ్రికాకు చెందిన విల్బర్ స్మిత్‌ కి పెద్ద అభిమానులం అంటూ చెప్పారు. ఆయన రాసిన కథ స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ ట్రాట్టింగ్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నట్టు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: