బిగ్ బాస్ 6 : ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Anilkumar
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు.టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో కి ఎలాంటి పాపులారిటీ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిన్న,పెద్ద తేడాలేకుండా ఈ షో ని చూస్తుంటారు... అయితే  కార్యక్రమం 21 మంది కంటెస్టెంట్లతో ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ 21 మంది కంటెస్టెంట్లను మూడు విభాగాలుగా విభజించి బిగ్ బాస్ పలు టాస్క్ లను నిర్వహిస్తూ తన గేమ్ మొదలు పెట్టాడు.బిగ్ బాస్ మొదటివారం నామినేషన్లను కూడా ఎంతో రసవత్తరంగా కొనసాగించారు. 

ఇక ఈవారం నామినేషన్ లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈవారం నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో ఎవరు బిగ్ బాస్ వీడనున్నారనే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.అయితే ఈ క్రమంలోనే నామినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో టాప్ ప్లేస్ లో ఫైమా, రెండవ స్థానంలో రేవంత్ ఉన్నారు.ఇక  వీరిద్దరి తర్వాత మూడవ స్థానంలో శ్రీ సత్య నాలుగో స్థానంలో చలాకి చంటి ఉన్నారు.ఇకపోతే  ఐదవ స్థానంలో ఇనయా ఉన్నారు. అయితే ఇక ఈ ఐదు మంది కంటెస్టెంట్లు సేఫ్ జోన్ లో ఉండగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు ఆరోహి అభినయశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

వీరిద్దరికీ చాలా తక్కువ మొత్తంలో ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. ఇక ఇలా వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉండగా వీరిలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ హౌస్ వీడనున్నారు.  ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు రానున్నారనే విషయంపై సర్వత్ర చర్చలు మొదలవుతున్నాయి.ఎవరు బిగ్ బాస్ ఇంట్లో నుండి వస్తారు అనే టెన్షన్ ఇప్పుడు ప్రజల్లో పెరిగిపోయింది. అయితే  ఇక ఈ వారం తప్పకుండా ఇనయ బయటకు వెళ్తుందని భావించినప్పటికీ ఓటింగ్ శాతం తారుమారు కావడంతో ఈమె సేఫ్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎక్కువగా ఆరోహి బిగ్ బాస్ హౌస్ వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: