'బింబిసార' కోసం మళ్ళీ వస్తున్న ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన బింబిసార సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్హిట్ అయింది. ఇకపోతే కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది.ఇదిలావుంటే ఇక  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమా ను దక్కించుకుని ఏకంగా పది కోట్ల వరకు లాభాలను దక్కించుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. పోతే  ఈ సినిమా తో నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత వరకు లాభాలను దక్కించుకుంటాడు అనే విషయం పక్కన పెడితే.. ఆయన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనడం లో సందేహం లేదు. 

కాగా ఆయన ఇప్పటికే మీడియా తో మాట్లాడుతూ ఇది తనకు పునర్జన్మ అన్నంతగా చెప్పుకుంటున్నాడు.అయితే  కళ్యాణ్ రామ్‌ అందుకే ఈ సినిమా ను అత్యంత స్పెషల్‌ గా చూసుకుంటున్నాడు.ఇక  ఆ కారణంగానే ఈ సినిమా కు భారీ ఫ్రీ రిలీజ్ చేసినట్లుగా ఒక భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయాలని నందమూరి కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇదిలావుంటే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంతేకాదు వైజాగ్ లో అత్యంత భారీ ఎత్తున సినిమా యొక్క సక్సెస్ వేడుకలను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నామని ప్రముఖ ఈవెంట్ నిర్వాహకులు చెప్పకు వచ్చారు.

ఇకపోతే  ఎన్టీఆర్ కూడా సినిమా యొక్క సక్సెస్ మీట్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే  కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ యొక్క సంఘటన నేపథ్యం లో అభిమాను లతో కాకుండా కేవలం జర్నలిస్ట్‌ లతో మీడియా మిత్రులతో మాత్రమే సక్సెస్ వేడుక నిర్వహించాలని అన్నయ్య కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ సూచించారని తెలుస్తోంది.కాగా  ఎన్టీఆర్ సూచన మేరకు భారీ వేడుక ను కాస్త క్యాన్సల్ చేసి భారీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నందమూరి కళ్యాణ్ రామ్ భావించాడు. ఇక అందుకోసం ఇండస్ట్రీ వర్గాల వారిని ఆహ్వానించడం తో పాటు మీడియా కు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించే యోచనలో ఉన్నాడట. అయితే ఆ కార్యక్రమం లో ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని సమాచారం అందుతోంది. అంతేకాదు భారీ వేడుక అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: