ఈ ముద్దుగుమ్మకి హీట్లున్న క్రేజీ ఆఫర్స్ అందుకోలేకపోవడానికి కారణం..?
ఈ ఆమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది కానీ సక్సెస్ మాత్రం అంతగా రాలేకపోయిందని చెప్పవచ్చు.వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత ప్రియాంక మోహన్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోలేదు కానీ తమిళ పరిశ్రమలో మాత్రం స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. హీరో శివ కార్తికేయన్ సరసన డాక్టర్ బాబు సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకోవడంతో తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేశారు ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత శివ కార్తికేయంతోని వెంటనే డాన్ సినిమాలో నటించింది.
ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ మధ్యలో హీరో సూర్యతో కలిసి పాన్ ఇండియా మూవీ ET సినిమాల నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఇలా తమిళంలో రెండు విజయాలు అందుకుని ఒక ప్లాప్ అందుకున్న ప్రియాంక అరుణ్ మోహన్ కెరియర్ కొనసాగుతూనే ఉన్నది. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతున్న కేవలం ఐదు సినిమాలలో మాత్రమే నటించింది. అయితే ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ఇంకా ప్రకటించలేదు. ఇంకా హీరోయిన్గా అవకాశాలను వెతుకుతూనే ఉందని టాక్ వినిపిస్తోంది.