ఆ సినిమా ఒప్పుకొని నాని తప్పు చేశాడా..?

Anilkumar
ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు  చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతేఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో.. ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఇదిలా వుండగా శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది. అయితే  ఇక మళ్ళీ నాని అంటే సుందరానికి సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్నాడు. దీంతో మళ్ళీ రేసులో వెనుక బడ్డాడు. కాగా ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం అంచనాలు అనుకోలేక విఫలం అయ్యింది.ఇదిలావుంటే ప్రస్తుతం నాని తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు..

 శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు నాని.. కాగా గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఇంత భారీ ఖర్చు వల్ల నిర్మాతలు కంగారు పడగా నాని వారితో మాట్లాడి ఖర్చు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి అని ఒప్పించాడట.. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ రాగా నాని ఇందులో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్ లో కనిపించాడు.

పోతే  మాస్ లుక్ లో నాని కనిపించి గూస్ బంప్స్ తెప్పించాడు.ఇకపోతే ప్రెసెంట్ అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా పక్కా లవ్ స్టోరీ అని వస్తున్నాయి.. అయితే నాని స్లమ్ ఏరియాలో ఉండే మాస్ అబ్బాయిగా నటించగా.. ఇక కీర్తి రిచ్ డాటర్ గా కనిపిస్తుందట.. ఇకపోతే వీరిద్దరి మధ్య సాగే రొటీన్ లవ్ డ్రామానే హై వోల్టేజ్ మాస్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడని.. అయితే ఇదేమీ కొత్త స్టోరీ లైన్ కాదని రొటీన్ లైన్ కావడంతో నాని మరో రిస్క్ చేస్తున్నాడని టాక్ వస్తుంది.. ఇక ఇది కనుక ప్లాప్ అయితే ఈయన కెరీర్ కూడా రిస్క్ లో పడే అవకాశాలు ఉన్నాయి.. పోతే హై బడ్జెట్ కావడంతో ఏకాస్త అటు ఇటు అయినా ఈయన మార్కెట్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది.. ఇక చూడాలి ఏం జరుగుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: