'మాచర్ల నియోజకవర్గం' మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన నితిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరీన్ , కృతి శెట్టి ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్ లుగానటిస్తూ ఉండగా , ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ నేపథ్యం చుట్టూ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి 'రా రా రెడ్డి ఐ యామ్ రెడీ' అనే లిరికల్ సాంగ్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.  ఈ సాంగ్ లో అంజలి నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలియ జేస్తూ నితిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఇలా నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం డబ్బింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: