అపుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న సెబాస్టియన్..?

Anilkumar
చాలామంది నిర్మాతలకు ఈ మధ్య ఓ టి టి ప్లాట్ఫామ్ బెస్ట్ ఆప్షన్ గా మారింది.అయితే ఒకవేళ సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలం అయితే వెంటనే ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. ఇలానే తాజాగా కుర్ర హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ చిత్రం రిలీజ్ అయిన 14 రోజులకే ఓటీటీ బాట పట్టడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఇక ఈ సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ప్రాజెక్టు 'సెబాస్టియన్ పీసీ 524' . ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్టు కొట్టాలనుకున్నాడు కిరణ్‌.అయితే  అతడి ఆశలన్నీ ఆవిరై పోయాయి.కాగా  ఈ చిత్రం బాక్సాపీస్ డీలా పడిపోయింది.

అయితే  బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్ , సువేక్ష హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.కాగా అదే రోజు భీమ్లానాయక్ రిలీజ్ ఉండటంతో విడుదలను మార్చి 4కు మార్చారు మేకర్స్. ఇక  మార్చి 4న శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లుతో పోటీ ఏర్పడింది. అయితే సెబాస్టియన్ గురించి అంతగా టాక్ లేకపోవడం, బాక్సాపీస్ వద్ద నెగెటివ్ రివ్యూస్, బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులెవరూ రాకపోవడంతో షోలు రద్ద చేయడం వంటి అంశాలు సినిమాను డేంజర్ జోన్‌లోకి నెట్టేశాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీని తరువత ఈ చిత్రాన్ని మార్చి 18న ఆహాలో విడుదలకి ప్లాన్ చేశారు. ఇక ఓటీటీలో అయిన తమ అభిమాన హీరో సినిమాని హిట్ చేయాలని అనుకుంటున్నారు. . అంతేకాదు ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగి.. చివరు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు.. ఇక  మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కోని సస్పెండ్ కావడం.. తిరిగి ఆ కేసును ఎలా చేధించాడు అనేది సినిమాలో చూపించారు.ఈ సినిమాలో  ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న ట్రైలర్‏లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇకపోతే ఈ సినిమా కథ ఏంటి అంటే కర్తవ్యం కంటే న్యాయం గొప్పదని తన అమ్మ చెప్పిన మాటల స్ఫూర్తితో సెబాస్టియన్‌ ఆ వివాహిత హత్యకి కారణమైన దోషిని ఎలా పట్టుకున్నాడు అనేదే ఈ దీని యొక్క  కథ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: