కేతిక ను ఎవరూ పట్టించుకోవడం లేదే!!
ఇంతటి గ్లామర్ ను చూపించే అమ్మాయి కాబట్టి తెలుగులో ఈమె కు ఎదురు లేదు అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈమెను ఏ హీరో కూడా పట్టించుకోకపోవడం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది. వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తున్న ఆమె పెద్ద హీరో సినిమా అందుకోక పోవడం తో ఆమె కెరీర్ ఏమైపోతుందో అన్న టెన్షన్ అభిమానులలో ఇప్పుడు నెలకొంది. దాంతో ఆమె పెద్ద సినిమా అవకాశం పొందడం కొసం ఎదురుచూపులు చూస్తున్నారు. అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించే హీరోయిన్ కావడం తో ఆమెపై అందరి చూపు పడుతుంది.
పెద్ద హీరోల సంగతి పక్కన పెడితే చిన్న హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నటన పరంగా కూడా ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మంచిగా అలరించే నటనే కనబరుస్తుంది. అయినా కూడా ఈమెను హీరోలు పట్టించుకోకపోవడం నిజంగా ఆమె దురదృష్టకరం అని చెప్పాలి. ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటారు. మరి ఈ ముద్దుగుమ్మ అదృష్టం ఎప్పుడు బాగా ఉండి ఆమెకు పెద్ద సినిమా అవకాశాలు తీసుకు వస్తుందో చూడాలి.