హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.టైటానిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు.బెర్నార్డ్ మరణవార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.1997 లో విడుదలైన ‘ టైటానిక్ ‘ సినిమాలో కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ పాత్రతో బెర్నార్డ్ హిల్ నటించి మెప్పించాడు . 79 ఏళ్ల బెర్నార్డ్ ఈ లోకంలో లేరంటే అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు. అయితే బెర్నార్డ్ హిల్ ఎలా మరణించాడు అనే సమాచారం తెలియరాలేదు. బెర్నార్డ్ మరణ వార్తను బార్బరా డిక్సన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంతాపాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. బెర్నార్డ్ హిల్ మరణించడం నాకు చాలా బాధ కలిగించిందని పోస్ట్ పెట్టాడు.
బెర్నార్డ్ హిల్ ‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ , బెర్నార్డ్ హిల్ ‘ది స్కార్పియన్ కింగ్’, ‘ది బాయ్స్ ఫ్రమ్ కౌంటీ క్లేర్’, ‘గోతికా’, ‘వింబుల్డన్’, ‘ది లీగ్ ఆఫ్ జెంటిల్‌మెన్’ చిత్రాలలో నటించి మెప్పించాడు.అతను బాఫ్టా, క్రిటిక్స్ ఛాయిస్ మరియు ఎమ్మీ వంటి అంతర్జాతీయ అవార్డులకు ఎంపికయ్యాడు. 2004లో, అతను స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును అందుకున్నాడు.పాత్రలు ప్రత్యేకించి చారిత్రక నేపథ్యపు పాత్రలలో నటించి రాణించి జీవించిన నటుడుగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందారు. ఆయన ఆదివారం ఉదయం చనిపోయినట్లు ఆయన ప్రతినిధి కౌల్సన్ నిర్థారిచారు. టైటానిక్ సినిమాలో ఆయన క్యాప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్‌గా నటించారు. మాంచెస్టర్ వాసి అయిన హిల్ టీవీ స్క్రీన్‌పై కూడా తొలిసారి ప్రవేశించారు. బిబిసిలో ఆయన నటించే సీరియల్ ఆదివారం నుంచే రిలే కానుంది.
పాత్రలు ప్రత్యేకించి చారిత్రక నేపథ్యపు పాత్రలలో నటించి రాణించి జీవించిన నటుడుగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందారు. ఆయన ఆదివారం ఉదయం చనిపోయినట్లు ఆయన ప్రతినిధి కౌల్సన్ నిర్థారిచారు. టైటానిక్ సినిమాలో ఆయన క్యాప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్‌గా నటించారు. మాంచెస్టర్ వాసి అయిన హిల్ టీవీ స్క్రీన్‌పై కూడా తొలిసారి ప్రవేశించారు. బిబిసిలో ఆయన నటించే సీరియల్ ఆదివారం నుంచే రిలే కానుంది.