ఈ సారి కూడా పవన్ సీఎం కాలేరా? ఇలా అయితే కష్టమే?
2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి 21 సీట్లు ఇస్తే నూటికి నూరు శాతం విజయం సాధించి చూపించారు. టీడీపీ అభ్యర్ధులకు భారీ ఎత్తున మెజారిటీలు రావడానికి జనసేన ఫుల్ సపోర్టు కారణం అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు 2029 ఎన్నికల్లో ఇదే కూటమితో కలసి వెళ్ళాలని పవన్ కూడా కోరుకుంటున్నారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ కూటమిని విచ్చిన్నం ఎవరూ చేయలేరని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానిని బట్టి చూస్తే ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉండరని అర్ధం అవుతోంది.
2024లో కేవలం 21 సీట్లను మాత్రమే తీసుకున్న జనసేన 2029లో ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఖాయమని విశ్లేషణలు అయితే ఉన్నాయి. బీజేపీ కూడా ఈసారి తన కోటా కూడా పెంచాలని కోరుతుంది. అంతే కాకుండా ఈసారి పవర్ షేర్ కూడా కోరుతాయని ప్రచారం అయితే ఉంది. అది అపుడు టీడీపీ పెద్దలకు ఆమోదయోగ్యంగా ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు.
కూటమి కంటిన్యూ అయితే పెద్దన్న పాత్రలో టీడీపీ ఉంటుంది అన్నది ఒక మాట. మరి ఎపుడూ టీడీపీ పెద్దన్నగా ఉంటే పవన్ కళ్యాణ్ సంగతి ఏమిటి ఆయన సీఎం అవుతారని ఆశించే అభిమానుల సంగతి ఏమిటి వారితో పాటుగా దశాబ్దాలుగా సీఈం పదవి తమ సామాజిక వర్గానికి దక్కలేదని భావించే అతి పెద్ద వర్గం ఆకాంక్షల సంగతి ఏమిటి అన్న చర్చ కూడా ఉంది.కూటమి కంటిన్యూ అయినా చాలా లెక్కలు మారుతాయని అంటున్నారు. అవి రాష్ట్ర స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకూ చాలానే మార్పులు తెస్తాయని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితులలో అంతా ఒక్కటే అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్నా తీరా ఫీల్డ్ లోకి దిగేసరికి చాలానే వ్యూహాలు చూడాల్సి ఉంటుందని అంటున్నారు.