తెలంగాణలో దుమ్ములేపుతున్న బీజేపీ జాతీయ నేతలు?

Chakravarthi Kalyan
తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ జోరు పెంచింది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తోంది. తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారాన్ని హోరెట్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీనడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు ఇప్పటికే పర్యటించారు.

ఇవాళ మరోసారి భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలంగాణలోలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ నిర్వహించే సభలో నడ్డా పాల్గొంటారు.

ఇక రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ప్రవాసి సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. ఉదయం ముషీరాబాద్‌లో యువ సమ్మేళనానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్‌ధామి హాజరుకానున్నారు. మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో నర్సంపేటలో నిర్వహించనున్న సభలో  ఆయన పాల్గొననున్నారు.

ఇక కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని జమ్మికుంటలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో నిర్వహించనున్న సభలో అన్నామలై పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరిధిలో సనత్‌నగర్ నుంచి పద్మారావునగర్ వరకు అన్నామలై, కిషన్‌రెడ్డి బైక్‌ర్యాలీ నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: