రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో అబద్దాలు చెప్పిస్తున్నారా?
నాలుగున్నార నెలలుగా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్న కేటీఆర్.. వృద్ధాప్య పింఛన్ 4000 ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళలకు 2500 ఎక్కడైనా ఇస్తున్నారా.. రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలైందా.. పెళ్ళి కూతుర్లకు తులం బంగారం ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తో ఉంటాడో బీజేపీ లోకి వెళ్తాడోనని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ హయం లో కరెంట్ కోతలు లేవన్న కేటీఆర్... కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాకా కరెంట్ కోతలు ఉన్నాయని... నీటి ఏద్దడి తలెత్తిందని.. 12 సీట్లు బీఆర్‌ఎస్‌కు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని కేటీఆర్ అంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టె వాడివా
రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరగకు కొంచం అటు ఇటు అయితే ఇబ్బంది..మోదీ కు ఓటు ఎందుకు వెయ్యాలి.. దేశానికి, తెలంగాణ కు ఏమ్ చేసినవ్ అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీపై మండిపడిన కేటీఆర్.. అయోధ్య లో గుడి కట్టినం మాకు ఓటు వేయండి అని భాజపా అభ్యర్థి అంటారని.. అలా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మేం రాజకీయం చేయబోమని కేటీఆర్ అన్నారు. పదేళ్లలో మోదీ అన్ని ధరలు పిరం చేశారని.. మళ్లీ మోడీనే గెలిపిస్తే దేశాన్ని ఎవరూ కాపాడలేరని కేటీఆర్ అన్నారు. అయితే ఇంత ప్రచారం చేస్తున్నా.. బీఆర్‌ఎస్ నేతల్లో మాత్రం గెలుపు దీమా కనిపించట్లేదు.