బోయపాటి - పవర్ స్టార్ మూవీ : కావాలంటున్న అభిమానులు..

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఊరమాస్ సినిమాలను తెరకెక్కిస్తూ టాక్ తో సంబంధం లేకుండా ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య బాబుతో చేసిన అఖండ సినిమాతో బోయపాటి శ్రీను ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.ఇక అదే సమయంలో ఈతరం డైరెక్టర్లలో సీనియర్ హీరోలను హ్యాండిల్ చేసి సక్సెస్ సాధించగల దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు మంచి పేరుంది. బోయపాటి శ్రీను బన్నీ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కాల్సి ఉంది. అయితే పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా పార్ట్2 షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు అసలు కనిపించడం లేదు. అయితే బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారని పవన్ కళ్యాణ్ కోసం బోయపాటి శ్రీను అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం చక్కర్లు కొడుతుంది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే పవన్ కళ్యాణ్ లేదా బోయపాటి శ్రీను స్పందించే వరకు ఆగాల్సిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ బోయపాటి శ్రీను స్క్రిప్ట్ కు ఓకే చెప్పినా ఈ సినిమా అయితే వెంటనే పట్టాలక్కే అవకాశం లేదు.అయితే అభిమానులు కూడా కోరడంతో త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్స్ లో ఎక్కువగా నటించలేదు. ఈ సినిమా పట్టాలెక్కితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బోయపాటి శ్రీను కథలు రొటీన్ గానే ఉన్నప్పటికీ కథనం మాత్రం కొత్తగా చాలా ఉండటంతో సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. మంచి ఫాంలో వున్నా కాని  వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంలో మాత్రం బోయపాటి శ్రీను ఫెయిల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: