వామ్మో: క్రేజీ కాంబినేష‌న్ ఫిక్స్ ...ఫ్యాన్స్ కు పూన‌కాలే..!

Divya
అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా రాజకీయాల మీదే తన దృష్టి పెట్టడం జరిగింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై. మళ్లీ వాకీ ల్ సాబ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఇక అభిమానులు కూడా ఎంతో సంతోషించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఒకేసారి ఎన్నో సినిమాలను గ్రీన్సిగ్నల్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉండగా.. మరికొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీరందరితో పాటుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకే బాగా ప్రాధాన్యత ఉండేలా కనిపిస్తోంది. ఇక అలాంటి సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. అలా తన కెరియర్ లోనే సరైనోడు, భద్ర, జయ జానకి నాయక, లెజెండ్ ఇంకా మరి కొత్త సినిమాలు కూడా తెరకెక్కించారు. బోయపాటి సినిమా తనదైన శైలిలో ఎప్పుడు మాస్ యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్నాడు. ఒక్క వినయ విధేయత రామ సినిమా తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న వే.. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమాని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది.
అయితే ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ.. ఈ కాంబినేషన్ కూడా ఓకే అయ్యిందంటే ఇక ఫాన్స్ కి పూనకాలే అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా మాస్ యాంగిల్ లో ఉన్న సినిమాలలో నటించలేదు. అయితే ఏదైనా అప్డేట్ ఉంటే త్వరలోనే ఈ సినిమా గురించి తెలుస్తుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: