సమంత యశోద కోసం మళయాళ స్టార్..!

shami
గుణశేఖర్ డైరక్షన్ లో శాకుతలం గా రాబోతున్న సమంత మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ యశోదని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. హరి, హరీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోశిస్తుంది. సినిమాలో సమంత రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. డిసెంబర్ 6న మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తుంది. యశోదలో ఆమె మధుబాల పాత్రలో కనిపించనున్నారు.
ఇక సినిమా కోసం మళయాళ నటుడు సెలెక్ట్ చేశారు చిత్రయూనిట్. యశోద సినిమాలో గౌతం పాత్రర్లో మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించారు. ఆల్రెడీ ఇదివరకు జనతా గ్యారేజ్ సినిమాలో నటించాడు ఉన్ని ముకుందన్ అదే కాదు అనుష్క శెట్టి సూపర్ హిట్ మూవీ భాగమతి సినిమాలో కూడా ఉన్ని ముకుందన్ నటించాడు. ఇక మాస్ మహరాజ్ రవితేజ ఖిలాడిలో కూడా అతను చేశాడని తెలుస్తుంది.
లేటెస్ట్ గా యశోద సినిమాలో కూడా అతన్ని తీసుకున్నారు. మళయాళ నటుడిగా అక్కడ వరుస సినిమాలు చేస్తున్న ఉన్ని ముకుందన్ తెలుగులో కూడా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటున్నాడు. ఓ విధంగా అతనికి తెలుగులో కూడా మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి యశోద లో అతనే మేల్ లీడ్ గా నటిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అనుష్క భాగమతితో ఆమె పక్కన నటించిన ఉన్ని ముకుందన్ సమంతకి జతగా చేస్తున్నాడు. తెలుగులో సినిమాలైతే చేస్తున్నా తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు ఉన్ని ముకుందన్. అయితే భాగమతి తరహాలో కాకుండా సమంత యశోదలో అతనికి మంచి వెయిట్ ఉన్న పాత్ర పడినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమాతో టాలీవుడ్ లో అతనికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: