వెల 'సిరి' : సిరివెన్నెల రాసిన పాటలు అన్నీ ఆణిముత్యాలే.. ఆయన సాధించిన అవార్డులు..!!

Anilkumar
తెలుగు సినీ సాహిత్య ప్రపంచంలో తన పాటలతో తెలుగు సూత్రం మైమరిపించే ప్రఖ్యాత గేయరచయితగా తనదైన ముద్ర వేసుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం యావత్ సినీ పరిశ్రమ నే కలచివేసింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన జననీ జన్మభూమి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సీతారామశాస్త్రి. ఇక ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల అనే సినిమాలో అన్ని పాటలను తానే రాసి నా ఇంటి పేరు ని సిరివెన్నెల గా మార్చుకున్నారు. 1986లో విడుదలైన ఈ సినిమాతో గేయరచయితగా సీతారామశాస్త్రిగారికి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత స్వయంకృషి, స్వర్ణ కమలం, దేవి పుత్రుడు చంద్రలేఖ మనసులో మాట పవిత్రబంధం భారతరత్న శ్రుతిలయలు, గాయం, స్వాతి కిరణం, క్షణ క్షణం, సింధూరం, నువ్వే కావాలి, ఒక్కడు, వర్షం, గమ్యం, చక్రం, మహాత్మ, నువ్వు నాకు నచ్చావ్, కిక్, దేవదాస్, అల వైకుంఠ పురం లో, రంగమార్తాండ ఇలాంటి ఎన్నో సినిమాలకు ఆయన పాటలను అందించారు. తన మూడున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు మూడు వేలకు పైగా పాటలను రాసారు ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఏకంగా తన పాటలకు 11 సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు ఉత్తమ గేయ రచయితగా నాలుగుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు మరెన్నో పురస్కారాలు-సత్కారాలు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి 2019లో భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది...
ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు ఉత్తమ రచయితగా సాధించిన అవార్డులను ఒకసారి పరిశీలిస్తే

నంది అవార్డులు..
1. సిరివెన్నెల (1986) - విధాత తలపున అనే పాటకి
2. శృతిలయలు (1987) - తెలవారదేమో స్వామి పాటకి
3. స్వర్ణకమలం (1988) - అందెలరావమిది పదములదా పాటకు
4. గాయం (1993) - సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని పాటకి
5. శుభ లగ్నం (1994) - చిలక ఏ తోడు లేక పాటకు
6. శ్రీకారం (1996) - మనసు కాస్త కలత పడితే పాటకి
7. సింధూరం (1997) - అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే పాటకు
8. ప్రేమ కథ (1999) - దేవుడు కరుణిస్తాడని పాటకి
9. చక్రం (2005) - జగమంత కుటుంబం నాది పాటకు
10. గమ్యం (2008) - ఎంత వరకు ఎందుకు కోరకు పాట
11. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) - మరి అంతగా
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు)..
1. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)వ సంవత్సరం
2. గమ్యం (2008)వ సంవత్సరం
3. మహాత్మ (2009)వ సంవత్సరం
4. కంచె (2015)వ సంవత్సరం
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
ఉత్తమ గేయ రచయిత (తెలుగు) - కంచె (2015)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: