అఖిలే కాదు.. చైతు కు మరో తమ్ముడు కూడా!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి అక్కినేని నాగార్జున మొదటి భార్యకు నాగచైతన్య జన్మించగా ఆ తర్వాత ఆయనతో అభిప్రాయ భేదాల కారణంగా చైతు తల్లి విడిపోయింది. ఆ తర్వాత నాగార్జున హీరోయిన్ అమల ను పెళ్లి చేసుకొని అక్కినేని అఖిల్ కు జన్మనిచ్చాడు. ఆ విధంగా అక్కినేని వంశం నుంచి ఇద్దరు హీరోలు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఆ విధంగా ఈ రోజు నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అక్కినేని నాగచైతన్య కు తమ్ముడు అఖిల్ ఒక్కడే కాదు మరొక తమ్ముడు కూడా ఉన్నాడు అంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియని నిజం అనే చెప్పాలి. చైతు కి తమ్ముడు అక్కినేని వంశం నుంచి కాదు కానీ ఓ తమ్ముడు కూడా ఉన్నాడట. అయితే తమ్ముడు ఉండడం పట్ల పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు కానీ ఆ తమ్ముడు ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. నాగార్జున మొదటి భార్య నుంచి విడిపోయిన కూడా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది అని చెప్పవచ్చు.

వారి కుటుంబ వేడుకల్లో అందరూ కలసి మెలసి ఆ వేడుకల్లో పాల్గొంటారు. స్నేహంగా ఉంటారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. నాగార్జున మొదటి భార్య తన నుండి విడిపోయిన తర్వాత ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోగా వారిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎందుకు మొదటి నుంచి దీనిపై సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారో తెలియదు కానీ ఆ రోజుల్లో లక్ష్మీ రెండో వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇక చైతు సమంత పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరగగా వారికి ఇటీవలే విడాకులు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: