బేబమ్మ వరుస అవకాశాలు కొట్టేయడానికి కారణం..!!

Divya
ఎవరైనా సరే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటే కచ్చితంగా వారు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ పొజిషన్ ను అందుకుంటారని చెప్పవచ్చు. అలా జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లా, ఏ మాయ చేసావే సినిమాతో సమంత, ఫిదా సినిమాతో సాయి పల్లవి , ఉప్పెన సినిమా తో కృతి శెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు..
ఇక మరి కొంతమందేమో మొదటి సినిమాలు యావరేజ్ గా అనిపించినా ఆ తర్వాత తమ నటనలో ఇంప్రూమెంట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ విజయాలను కూడా పొందిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అంతేకాదు లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా హ్యాట్రిక్ విజయాలను కొట్టిన భామలు కూడా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కృతి శెట్టి ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలతో దూసుకుపోతుంది. అంతే కాదు ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు..
ప్రస్తుతం బేబమ్మ వరుస సినిమాలతో దూసుకుపోవడానికి కారణం మొదటి మూవీ సూపర్ హిట్ అవ్వడం.. అందం ,నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం.. సొట్ట బుగ్గల సుందరికి దర్శకులు కూడా ఫిదా అవుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈమెకు వరుస అవకాశాలు రావడం జరుగుతోంది. ఉప్పెనతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి, ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటించడానికి సిద్ధంఅయింది.ఈ సినిమాలో నాగలక్ష్మి గా  కనిపించబోతున్న ఈ భామ  తన మూడవ సినిమాతోనే లేడీ ఓరియెంటెడ్  చిత్రానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే మరో స్టార్ హీరో సినిమాలో కూడా నటించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె కూడా త్వరలోనే స్టార్ హీరోయిన్ పొజిషన్ కు చేరుకుంటుంది అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: