శ్రీలీల కు అనుకోని మ్యానియా !
‘పెళ్ళిసందడి’ మూవీ పై పెదవి విరిచిన విమర్శకులు శ్రీలీల గ్లామర్ షోకు మాత్రం మార్కులు వేసారు. ఇప్పుడు అదే ఆమెకు అదృష్టంగా మారినట్లు అనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా అఖిల్ నటించబోయే ఒక లేటెస్ట్ మూవీలో శ్రీలీల కు అవకాశం రావచ్చు అని ప్రచారం జరుగుతోంది.
నటిగా శ్రీలీల కు పెద్దగా మార్కులు పడనప్పటికీ గ్లామర్ విషయంలోను అదేవిధంగా డాన్స్ ల పరంగాను శ్రీలీలకు చాలమంచి ప్రశంసలు లభించిన నేపధ్యంలో ఆమె నటించిన మొదటి మూవీ ఫెయిల్ అయినప్పటికీ ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ బ్యూటీస్ గా పేరు గాంచిన రష్మిక పూజా హెగ్డే ల పారితోషికం 3 కోట్ల స్థాయిలో ఉంది.
దీనితో సినిమా బడ్జెట్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు శ్రీలీల ఒక పరిష్కారంగా కనిపించే ఆస్కారం ఉంది. దీనికితోడు ఆమె తెలుగు అమ్మాయి కావడంతో ప్రాంతీయ అభిమానంతో కూడ ఆమెకు ఇలా పరాజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి అనుకోవాలి. వాస్తానికి శ్రీలీల ‘పెళ్లిసందడి’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె తన పేరు పాత తరం హీరోయిన్ లా ఉంది కాబట్టి ఆపేరు మార్చమని రాఘవేంద్రరావు ను అడిగిందట. అయితే శ్రీలీల పేరు ఏమాత్రం పాత పేరు కాదని ఈ పేరుతోనే జనం ఆమెకు కనెక్ట్ అయి ఆమెకు క్రేజ్ వస్తుందని చెప్పాడట. ఇప్పుడు ఆమాటలే నిజం అయినట్లు అనుకోవాలి..