దేవుడు అంటే అసలు అర్థం చెప్పిన.. సినిమా అది?
గోపాల గోపాల అనే సినిమా దేవుడు ఉన్నాడా లేడా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాను నేటి ట్రెండ్ కు అనుగుణంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించగా దేవుడు లేడు అనే ఒక నాస్తికుడు పాత్రలో వెంకటేష్ నటిస్తాడు. అయితే ఇక ఏకంగా వెంకటేష్ కోసం పవన్ కళ్యాణ్ భూమి మీదికి వచ్చేస్తాడు. ఆ తర్వాత దేవుడు అనే పేరు చెప్పి నేటి సమాజంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు. దేవుడి పేరు చెప్పి ఎంత మంది మోసం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో దర్శకుడు బాగా చూపించాడు అని చెప్పాలి.
దేవుడి పేరు చెప్పి భారీగా డబ్బులు దండుకోవడం కాదు.. పది మంది కడుపు నింపడం.. పది మందికి బాగు కోరుకోవడమే అసలైన దైవత్వం అంటూ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. నాస్తికుడు పాత్రలో నటించిన వెంకటేష్ దేవుడిని నమ్మక పోయినప్పటికీ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇక దేవుడు కోరుకునేది కూడా ఇదే కానుకలు.. మొక్కలు కాదు అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు ఇద్దరు హీరోలు. ఇక ఈ మెసేజ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది.