శివగామి ఎంత గొప్పదైనా .... నీలాంబరి ముందు దిగదుడుపే .... ??

GVK Writings
టాలీవుడ్ లో నటిగా కొన్నేళ్ల నుండి అంచలంచలుగా ఎదుగుతూ నేడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకాభిమానుల్లో మంచి పేరు దక్కించుకున్న నటి రమ్యకృష్ణ. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి అందరి నుండి మంచి పేరు దక్కించుకున్న రమ్యకృష్ణ, ఇటీవల కొన్నేళ్లుగా ఎక్కువగా తల్లి, అక్క, వదిన వంటి పాత్రలు చేస్తూ కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆమె నటించిన శైలజ రెడ్డి అల్లుడు లోని టైటిల్ రోల్ తో పాటు సోగ్గాడే చిన్ని నాయన మూవీలోని సత్యభామ, అలానే బాహుబలి రెండు సినిమాల్లోని శివగామి పాత్రలు నటిగా ఆమెకు విపరీతమైన గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ తో పాటు విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ తీస్తున్న లైగర్ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు రమ్యకృష్ణ. అయితే రమ్యకృష్ణ కి కేవలం తెలుగులోనే మాత్రమే కాక అటు ఇతర భాషల్లో కూడా నటిగా గుర్తింపు తెచ్చిన సినిమాలు, పాత్రలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన కెరీర్ లో వచ్చిన పాత్రలు అన్నిటిలోకి తనకు నటిగా విపరీతమైన పేరుని, క్రేజ్ తెచ్చిపెట్టిన రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహా మూవీ లోని నీలాంబరి పాత్ర ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్తూ ఉంటారు రమ్యకృష్ణ.
తాను పట్టిన పంతం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించి ఆపై చివరికి నరసింహ కు ఏమాత్రం తలొగ్గకుండా చివరికి తనను తాను చంపుకునే మూర్ఖమైన మొండి పాత్రలో రమ్యకృష్ణ నిజంగా నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాలో హీరో రజిని తో పాటు ఆయనకు ధీటుగా యాక్ట్ చేసి అందరి నుండి ప్రశంసలు పొందారు రమ్య. అయితే ఆమె కెరీర్ లో శివగామి కూడా ఎంతో గొప్ప పాత్ర అయినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కువ స్కోప్ ఉన్న నీలాంబరి రోల్ రమ్య సినిమా కెరీర్ లో కలికితురాయి అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: