రమ్యకృష్ణ కెరీర్ గ్రాఫ్‌ను మార్చిన సినిమా ఏంటో తెలుసా.. !

Veldandi Saikiran
టాలీవుడ్‌ సీనియర్‌ నటి, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రమ్య కృష్ణ గురించి.. తెలుగు ప్రేక్షకులకు స్పెషల్‌ గా చెప్పనక్కర్లేదు.  చిత్ర పరిశ్రమను తన అంద చందాలతో ఆకట్టుకుంది ఈ నటి.  అప్పట్లో తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్‌ గా చక్రం తిప్పింది రమ్యకృష్ణ.  పరిశ్రమ ఏదైనా సరే... తన అద్భుత మైన నటన తో అందరినీ ఆకట్టుకుంది రమ్యకృష్ణ.  అద్భుతమైన నటన తో పాటు..  గ్లామర్‌ లోనైనా తక్కువేం కాదని చాలా సార్లు రుజువు చేసింది రమ్మకృష్ణ. 

అయితే.. 1990 సంవత్సరం లో వచ్చిన అల్లుడు గారు మూవీ తో మంచి విజయం అందుకుంది రమ్య కృష్ణ.  ఆ సినిమా నుంచి చిత్ర పరిశ్రమలో వెనక్కు చూడకుండా ఎదిగి పోయింది. దక్షిణ చిత్ర పరిశ్రమలోని అందరూ టాప్‌ హీరో లతో నటించింది ఈ భామ.  1990  సంవత్సరం నుంచి 2000 వ సంవత్సరం వరకు ఎన్నో సినిమాలు చేసి....  బంపర్‌ విజయాలను అందుకుంది.  

కొన్ని సినిమాలు ప్రేక్షకులు ఆదరించకున్నా...  చాలా సినిమా లను ప్రేక్షకుల గుండెల్లో నిలిచాయి.  అందులో ముఖ్యంగా నరసింహ సినిమా... ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ నే ఓ ఊపు ఊపేసింది. సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ హీ రోగా..  ఈ సినిమా తెరకెక్కింది.  అయితే.. ఈ నరసింహ సినిమా లో నీలాంబరి  పాత్ర లో చేసింది రమ్య కృష్ణ.  నిలాంబరి గెటప్‌ లో రమ్యకృష్ణ ఇరగ దీసింది.  ఇప్పటికే ఈ సినిమా వస్తే..  ప్రేక్షకులు పడి పడి చూస్తారు. ఇక సినిమానే రమ్యకృష్ణ కెరీర్‌ లో ఇప్పటికి బిగ్గెస్ట్‌ హిట్‌ గానే ఉండటం గమనార్హం.  కాగా.. స్టార్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీని రమ్య కృష్ణ..  వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.  ఇటీవలే..  బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి....  దుమ్ము లేపింది రమ్య కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: