జక్కన్న కంటే దారుణంగా ఎన్టీఆర్ ని ఆ డైరెక్టర్ చూపించబోతున్నాడా...?

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో తారక్ కొమురం భీం పాత్రలో తన నటవిశ్వరూపం చూపించాడని సమాచారం.
కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో రెండోసారి ఓ సినిమా చేసేందుకు తారక్ సిద్ధమవుతున్నాడని అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశాని తెలుస్తుంది.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా ఓకే చేసే పనిలో పడ్డాడట  ఎన్టీఆర్.
ఈ క్రమంలో తారక్‌లోని విలక్షణ నటుడిని ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా ఓ డైరెక్టర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. తమిళంలో తనదైన విలక్షణ చిత్రాలతో పేరుతెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్, టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో కోసం ఆయన ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడని సమాచారం.ఈ సినిమా కథను ముందుగా తారక్‌కు వినిపించాలని చూస్తున్నాడట ఆ దర్శకుడు.
ఎన్టీఆర్ కు ఈ కథ నచ్చితే ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించాలని వెట్రిమారన్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.ఈ సినిమాలో హీరో పాత్రలో తారక్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించేందుకు తాను రెడీ అంటున్నాడట ఈ తమిళ డైరెక్టర్. తారక్‌తో పనిచేసిన డైరెక్టర్స్ ఇప్పటివరకు కేవలం యాక్షన్ హీరోగా మాత్రమే ఆయన్ను ప్రెజెంట్ చేశారని తెలుస్తుంది.కానీ తాను మాత్రం తారక్‌లోని మరో కొత్త యాంగిల్‌ను చూపించి ప్రేక్షకులతో ఔరా అనిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడట వెట్రిమారన్. మరి వెట్రిమారన్ ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడంటే ఎన్టీఆర్ కోసం ఆయన ఎలాంటి కథను రెడీ చేశాడో అర్థం చేసుకోవచ్చని తెలుస్తుంది. ఈ కాంబో నిజంగా సెట్ అయితే మాత్రం టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ మూవీ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా త్వరగా పట్టాలెక్కితే బాగుండని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: