పవన్ కి చెల్లిగా ఉప్పెన బ్యూటీ ... కానీ .. ?

GVK Writings
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భీమ్లా నాయక్, అలానే హరిహర వీరమల్లు రెండు సినిమాలు కూడా త్వరలో విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటిలో క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాతగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న హరి హర వీరమల్లు లో పవన్ కళ్యాణ్, వీరమల్లు అనే వజ్రాల దొంగ గా నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.
కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు టాక్. ఇక మరోవైపు ఇప్పటికే భీమ్లా నాయక్ కోసం వరుసగా డైలీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు పవర్ స్టార్. అందుతున్న సమాచారం ప్రకారం మరొక నెలలో ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందని టాక్. రానా మరొక కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్, డైలాగ్స్ ని రాస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల తరువాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీతో పాటు సురేందర్ రెడ్డి తో మరొక మూవీ కూడా చేయనున్నారు పవన్.
అయితే అసలు విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా పలు టాలీవడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ నటించనున్న తదుపరి సినిమాలో ఆయనకి చెల్లిగా ఉప్పెన తో సక్సెస్ కొట్టిన యువ భామ కృతి శెట్టి నటించనున్నట్లు చెప్తున్నారు. అయితే కృతి, పవన్ త్వరలో నటించనున్న ఈ రెండు సినిమాల్లో దేనిలో ఆమె చెల్లి పాత్ర చేస్తున్నారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కాగా ఈ విషయమై త్వరలో అఫీషియల్ గా న్యూస్ బయటకు రానుందని, అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: