ఎన్టిఆర్ కి గొప్ప హిట్ ని తెచ్చి పెట్టిన యమదొంగ..!!

P.Nishanth Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనలో ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి చిత్రం నుంచి ప్రస్తుతం చేస్తున్న సినిమా వరకు ప్రేక్షకులను మెప్పించే, ప్రేక్షకులను అలరించే అంశాలు ఎక్కువగా పెట్టాలంటూ దర్శక నిర్మాతలకు సూచిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా గా తన సినిమా ఉండాలని చెబుతూ ఉంటాడు. అభిమానులకు ఎంతో విలువనిచ్చే ఎన్టీఆర్ కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఆ సినిమాలు భారీ ఫ్లాప్ లుగా మిగిలాయి.

అయితే ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఆయన ఒకే ఒక్క చిత్రంతో కం బ్యాక్ చేసి మళ్లీ ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు దూసుకు పోయాడు. ఆ విధంగా సింహాద్రి సినిమా తర్వాత ఆయన వరుసగా భారీ ఫ్లాప్ సినిమాలను చేసి తన చాలా డౌన్ అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా తర్వాత ఏకంగా ఆరు ఫ్లాపులను ఎదుర్కొని తన కెరీర్ ప్రమాదంలో పడే సుకున్నాడు. ఆంధ్రావాలా, సాంబ , నా అల్లుడు , నరసింహుడు,  అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరచాడు. వీటిలో రాఖీ సినిమా పర్వాలేదనిపించింది.

అయితే రాజమౌళి దర్శకత్వంలోనీ యమదొంగ సినిమా చేసి ఎన్టీఆర్ భారీ హిట్ ను సొంతం చేసుకుని మళ్లీ మంచి కం బ్యాక్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యముడు గా నటించి పెద్ద ఎన్టీఆర్ ని గుర్తు చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ భారీ డైలాగులు అవలీలగా చెప్పి ఎన్టీఆర్ తనలోని నటనా కౌశల్యాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా యమలోకం ఘట్టంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు. దొంగ గా భూలోకంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్న హీరో ఒక అమ్మాయిని ప్రేమించి చిక్కుల్లో పడతాడు. ఆ అమ్మాయి తరపు బంధువులు అతన్ని చంపబోయే యమలోకంలో యముడిని ముప్పుతిప్పలు పెట్టి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. వచ్చాక అమ్మాయి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది ఈ సినిమా కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: