రవితేజ పై రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు?

murali krishna
రవితేజ సినిమా ఇండస్ట్రీలో ఏ బాక్గ్రౌండ్ లేకుండా ఎవరి అండ  లేకుండా టాప్ స్టార్ గా ఎదిగిన వైనం ఒక్క ఇండస్ట్రీ లో ఎదుగుతున్నవారికి మాత్రమే కాదు మిగిలిన  ఏ రంగంలో రానించాలి అనుకునేవారికి రవితేజ ఒక గొప్ప ఇన్స్పిరేషన్.1988లో సినిమా హీరో అవుదామని చెన్నై వెళ్లిన రవితేజ ఏడాది పాటు కాలిగానే తిరిగాడు. ఈ సమయంలోనే గుణశేఖర్, avs చౌదరి పరిచయం అయి వారితో పాటు రూమ్ లో ఉండసాగాడు. ఇంటి వద్ద నుంచి  తెచ్చుకున్న డబ్బు అయిపోవటంతో చిన్న చిన్న సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు  వేయసాగాడు.రోజుకు10రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
1990లో గుణశేఖర్ రిఫరెన్స్ తో కర్తవ్యం సినిమాలో ఒక పాత్ర పోషించాడు. దానితో గుర్తింపు రాకపోయినా ఒక మంచి సర్కిల్ ఫామ్ అయింది. దానిలో కృష్ణవంశీ ఒకరు. ఆ పరిచయాలతో సినిమాలలో  చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. అయితే డబ్బులు మాత్రం రావటం లేదు. కృష్ణవంశీ సలహాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు.1996 లో నిన్నే పెళ్లాడతా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. ఇదే సినిమాలో వేరే అసిస్టెంట్ డైరెక్టర్ అయిన పూరిజగన్నాధ్ తో పరిచయం ఏర్పడింది.
కృషవంశీ డైరెక్షన్ లో సింధూరం సినిమాలో రవితేజ ఒక హీరోగా చేయటంతో ఇండస్ట్రీలో రవితేజ అనే ఆర్టిస్ట్ వున్నాడని తెలిసింది. ఆ  తరువాత  వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు వచ్చాయి. మనసిచ్చిచూడు సినిమాకు శ్రీనువైట్ల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అప్పుడే రవితేజ టాలెంట్ చూసి నా ఫస్ట్ మూవీలో నీకు అవకాశం ఇస్తాను అని చెప్పాడు.చెప్పినట్టుగానే నీకోసం మూవీలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.తరువాత తన క్లోజ్ ఫ్రెండ్ పూరిజగన్నాధ్ తన వరుస సినిమాలలో రవితేజను హీరోగా తీసుకోవడం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి ఇలా వరుస హిట్స్ తో స్టార్ హీరో అయిపోయాడు.
విక్రమార్కుడు, కిక్, నేనింతే సినిమాలు రవితేజ ఎటువంటి పాత్రను అయినా అవలీలాగా చేయగలడు  అని నిరూపించుకున్నాడు.ఇది ఇలా ఉంటే రవితేజ గురించి రాఘవేంద్రరావు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రవితేజ  కష్టపడి పైకి వచ్చిన మనిషి. ఇతర హీరోలు చేసిన పాత్రలు రవితేజ అవలీలగా చేయగలడు. కానీ రవితేజ నటించిన పాత్రలు ఇతర హీరోలు 50%కూడా చేయలేరు. ఆయన ఎనర్జీ ఆవిధంగా ఉంటుంది అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: