హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాంత్ అడ్డాలో టీడీపీ అడ్రెస్ గల్లంతు....

కడప జిల్లా అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే విషయం తెలిసిందే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంపై వైఎస్సార్ ఫ్యామిలీకి పట్టుంది. అందుకే గతంలో జిల్లాలో కాంగ్రెస్ హవా ఉండేది. ఇప్పుడు వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జిల్లాలో రాయచోటి వైసీపీ కంచుకోట. ఇక్కడ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి హవా ఎక్కువగా ఉంది.
వైఎస్ ఫ్యామిలీకు వీరవిధేయుడు అయిన శ్రీకాంత్...2009 ఎన్నికల్లో రాయచోటి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. వైఎస్ మరణంతో జగన్ పెట్టిన వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012 వచ్చిన ఉపఎన్నికల్లో శ్రీకాంత్ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి దాదాపు 56 వేలపైనే ఓట్ల మెజారిటీతో గెలిచారు.   నెక్స్ట్ 2014, 2019 ఎన్నికల్లో కూడా శ్రీకాంత్ వరుసగా గెలిచేశారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, పైగా జగన్‌కు సన్నిహితంగా ఉండే నేత కావడంతో శ్రీకాంత్‌కు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా శ్రీకాంత్‌కు మంత్రి పదవి దక్కలేదు.
కాకపోతే కేబినెట్ హోదా ఉండే ప్రభుత్వ చీఫ్‌విప్ పదవి దక్కింది. ఇటు ఎమ్మెల్యేగా, అటు చీఫ్‌విప్‌గా శ్రీకాంత్ రెడ్డి మంచి పనితీరు కనబరుస్తున్నారు. రాయచోటి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో ఎలాంటి లోటు లేదు. ఇక్కడ అసలు టీడీపీకి పెద్ద స్కోప్ లేదు. టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు ఎలాగో సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో తన కుమారుడు ప్రసాద్ బాబుకు సీటు దక్కపోవడంతో ఆయన టీడీపీకి దూరం జరిగారు.   ఇక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి, ఏదో అలా అలా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇప్పటికీ నియోజకవర్గంపై పట్టు దక్కలేదు. దీంతో రాయచోటిలో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. మొత్తానికైతే రాయచోటి శ్రీకాంత్ అడ్డాగా మారిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: