అశ్వత్థామ కలియుగాంతం వరకు చిరంజీవే! కాని జీవితం నిష్ప్రయోజనం


అశ్వత్థామ మహభారత మహరధుల్లో అగ్రగణ్యుడు. గురుదేవుడు ద్రోణాచార్యులవారికి అనేక సంవత్సరాల తపోధ్యానాలకు ఆ పరమశివుడు సంతసించి  పరవసించి అనుగ్రహించిన వర ప్రసాదం ఈ  ఏకైక కుమార రత్నం. సమస్థ విద్యా పారంగతుడు గానే శిరస్సు నందు జ్ఞానస్వరూపమై వెలుగులు చిందే వజ్ర వైఢూర్య ఖచిత మణి భూషణుడై  జన్మించిన అష్ఠ రుద్రుల్లో ఒకరు. నుదురుకు పైన శిరస్సు ముందు భాగము లో జన్మతః ఉన్న మణి ఆయనకు భూత, ప్రేత, పిశాచాలు, విష నాగులే కాదు సమస్థ పశు పక్ష్యాదుల నుండి తనను తానురక్షించుకునే శక్తిని, అధికారాన్నే కాదు, జ్ఞాన నేత్రమై విలసిల్లుతుంది.  ఏకంగా ఆయన శివ స్వరూపమే. 



విశ్వం లో చిరంజీవులై చిరకాలం ఏకాంతంగా మిగిలిపోయిన హనుమంతుని లాగే  పరమపవిత్ర శాశ్విత శివ స్వరూపం అశ్వత్థామ. అయితే ఇంత పవిత్రుడైనా పాండవ పత్ని ద్రౌపది పసి తనయులైదుగురిని  నిదురించివున్న వేళ కుయుక్తితో సంహరించిన పాపానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన శాపపరిహారార్ధం కలియుగ కాలమంతా చిరా యు వై ప్రారబ్ధం కొలది విరాగై జీవించ వలసి వచ్చింది. 



పవిత్రుడైనా పాపాత్ముల పంచనచేరి వాళ్ళను రంజింప చేయటమే పరమావధిగా పెట్టుకున్నందుకు, నిదురించే పసి పాపలైన ద్రౌపదీదేవి సంతానమైన ఉప పాండవులను నిర్ధాక్షిణ్యంగా సంహరించినందుకు ద్రౌపది కోరిక ప్రకారం గురు పుత్రునిగా క్షమించినా-శ్రీకృష్ణుని అదేశానుసారం శిరోముండనం (తలవెంట్రుకలను తొలగించటం) చేసి ఆ శిరస్సు పై ప్రకాశిస్తున్న జన్మతః సిద్ధించిన జ్ఞానమణిని కోసి తీసుకుంటాడు అర్జునుడు. దాంతో ఆయనలోని దేదీప్యవంతమైన వెలుగు, విజ్ఞానం, జీవితేచ్చ నశించి విరాగి గా మారిపోగా - భగవానుడు చిరంజీవివై కలియుగాంతం వరకు దారి తెన్నూ తెలియని విరాగిగా ఉంటూ అడవులు పర్వత ప్రాంతాల్లో బాటసారులకు దారి చూపుతూ బ్రతక మని శాపం ఇస్తాడు. అయితే ఆ యుద్ధం లో పాండవులు గెలిచాక అశ్వత్థామ పారిపోయి చెవదన అనే ఓ ప్రదేశంలో ఉంటున్నాడని ఆ ప్రదేశం ఇప్పుడు గుజరాత్మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది. అక్కడ అశ్వత్థామ ఇప్పటికీ దెయ్యం రూపంలో తిరుగుతూ ఉంటాడని ఈ క్రమంలో కొందరు అతన్ని చూసినట్టు కూడా చరిత్ర చెబుతోంది.



కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, అశ్వత్థామ ఇరువురూ ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకుంటారు. అయితే అవి రెండూ కలిస్తే ప్రళయం వస్తుందని ఋషులు హెచ్చరించడం తో అర్జునుడు తాను వేసిన బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుని సహకారం తో విజయవంతంగా ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ ఆ పని చేయలేకపోతాడు. బ్రహ్మాస్త్ర ఉపసంహరణ అనేది దైవానుగ్రహబలం ఉంటేనే సాధ్యం. అది అర్జునునికి పుష్కలంగా ఉంది.



దీంతో ఆ బ్రహ్మాస్త్రానికి కచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది. అప్పుడు అశ్వత్థామ పాండవ వంశం లేకుండా చేస్తానని సుయోధనునికి ఇచ్చిన మాటను నిజం చేసే క్రమంలో బ్రహ్మాస్త్ర గమన దిశను పాండవ స్త్రీల గర్భాల మీదకు పంపుతాడు. వారిలో అర్జునుడి కోడలు, అభిమన్యుని భార్య ఉత్తర కూడా ఉంటుంది. ఉత్తర గర్భవతి. అయితే బ్రహ్మాస్త్రం కారణంగా గర్భం విచ్చిన్నమై గర్భస్థ శిశువు మృతి చెందుతింది. కానీ కృష్ణుడు తన హస్త స్పర్శ తో ఆ మరణించిన శిశువును బ్రతికిస్తాడు. అలా కృష్ణ హస్త పరీక్షతో బ్రతికించబడ్డ శిశువు కాబట్టి పరీక్షిత్తు అని పిలవబతాడు.



ఈ క్రమంలో కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెట్టాడని అంటారు, కలియుగం అంతం అయ్యే వరకు 6 వేల సంవత్సరాల పాటు దెయ్యంగా తిరగాలని, దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఒకే ప్రాంతంలో ఉండాలని, అనేక రోగాలతో బాధ పడాలని శాపం పెట్టినట్లు చెబుతారు.  

 

శిరోమణిని అర్జునుడు కోసితీసున్నప్పుడు ఏర్పడ్డ గాయం అతన్ని ఇప్పటికీ బాధిస్తుందని అనేక రోగ పీడనలను భరిస్తూ జీవిస్తూ మరణానికి ఏదురుచూస్తూ శ్రీ మహా విష్ణువు పదవ అవతారమైన కల్కి ఆగమనం కోసం నిరీక్షిస్తూ విరాగిగా (ఏ ఆశయం ఆలోచన గమ్యం లేని స్థితి) నిర్మానుష్య ప్రాంతాల్లో తప్పిపోయిన వారికి దారి చూపిస్తూ ఉంటాడని ప్రతీతి. 


అశ్వత్థామ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని ఆశక్తికర విషయాలు ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధ సమయములో అహకారం తో భీమునితో ఇప్పటి "చెవదన" ప్రాంతంలో అశ్వత్థామ గధా యుద్ధం లో తలపడతాడు. భీముడి గధా ఘాతానికి ఆ ప్రాంతం లో పెద్ద సరస్సు ఏర్పడింది. అది ఇప్పటికీ "భీం ఖండ్" అనే పేరుతో ప్రసిద్ది చెందింది.



అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని అసిర్ఘడ్ కోటలో సుమారు 5 వేల ఏళ్ల కిందట అశ్వత్థామ అక్కడ ఉన్న శివాలయంలో అతను పూజలు చేస్తూ జీనించే వాడని చరిత్ర చెబుతోంది. ఆ శివాలయమును మహమ్మద్ జహీర్ అనే ఓ ముస్లిం ప్రస్తుతం గుడిని శుభ్రం చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఆ ప్రాంతమంతా ఇప్పుడు టూరిస్టు కేంద్రం గా మారింది.


స్వయానా తాను శివ స్వరూపమైనా "పసి పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపిన నేరం, ద్రౌపది గర్భ శోకం తో తగిలిన ఉసురు, ఆమె క్షమించినా కూడా, అనవసరంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన పాపం, మహా పండితుని పుత్రుడై ఉండి పాపాత్ముల పంచన చేరి పాపాలను విస్త్రుతంగా చేసిన అనైతికత ఆయనను కట్టి కుడిపింది. అలాగే భగవాన్ శ్రీకృష్ణుని ఆగ్రహానికి గురయ్యేంత పాపం అంత మేధావిని, మహారధిగా కురుక్షెత్ర యుద్ధములో భీష్ముని చేత నియమించబడ్డ వీరుణ్ణి నిర్వీర్యుణ్ణి చేసింది. అశ్వత్థామకు మరణం లేదని, కేవలం కలియుగం అంతమైనప్పుడే అతను మరణిస్తాడని అంతవరకు ఆయన చిరంజీవే. ఆ ప్రకారంగానే అశ్వత్థామ ఇప్పటికీ పైన చెప్పిన చెవదన అనే ప్రాంతంలో చేతిలో కాగడా పట్టుకుని నిత్యం తిరుగుతూ దారి తప్పిన బాటసారులకు దారి చూపిస్తూ ఉంటున్నట్లు ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటున్నారు.



అనేక ఉదాహరణలున్నా నిర్ధారిత ఉదాహరణగా ఒక విషయం గమనించవచ్చు అదే సామ్రాట్ పృద్విరాజ్ 1140 ప్రాంతములో అశ్వత్థామను కలిశాడు. సామ్రాట్ పృద్విరాజ్ మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోయి అడవుల్లో తిరిగేటప్పుడు అశ్వత్థామను చూసినట్లు ఆయన ద్వారా తను ప్రయాణించవలసిన దారి తెలుసుకున్నట్లు "పృద్విరాజా రాసో" అనే గ్రంధంలో రాసు కున్నారు. అలాగే అశ్వత్థామ శిరస్సు పై నున్న గాయాన్ని స్వయంగా వైద్యుడైన తాను నయంచేయటానికి ప్రయత్నించినా దాని గుణం కనిపించలేదని  - ఆశ్చర్యపోయిన పృద్విరాజ్ కారణం ఉహించి మీరు అశ్వత్థామకదా? అని, మచ్చ మణిని కోసినప్పుడు ఏర్పడినట్లు నిర్ధారించి అడుగగా ఆయనా అక్కడనుండి సమాధానం ఇవ్వకుండా అవునన్నట్లు చూస్తూ నిష్క్రమించారని కూడా ఆ గ్రంధములో రాసి ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: