ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే... మీ కిచెన్ మెరిసిపోతుందట!
మరి ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. వంట గదిలో వాష్ బేసిన్ ముఖ్యమైనది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులో తిన్న సామాన్లను శుభ్రం చేస్తుంటారు. అందులో ఉండే నూనె, కొవ్వు పదార్థాలు సింక్ లోనే ఉండిపోతాయి. దీనివల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అందుకే దీనిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. షింక్ శుభ్రంగా ఉండేందుకు నాఫ్తలీన్ గోళీలు ఉపయోగపడతాయి. వీటిని సింక్ లోపల వేయకుండా పైప్ దగ్గర ఉంచాలి. ఇలా చేస్తే, సింక్ నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. అలాగే వంట గదిలో రోజు ఉపయోగించే పాత్రలన్నీ ఒకచోట సెట్ చేసుకోవాలి.
దీనివల్ల టైం ఆదా అవ్వడమే కాకుండా కిచెన్ చూడటానికి నీట్ గా కనిపిస్తుంది. లేదంటే అవసరాని కంటే ఎక్కువగా పాత్రలను క్లీన్ చేయాల్సి వస్తుంది. చాలామంది కిచెన్ లో కనిపించిన పదార్థాలు అన్నిటినీ ఫ్రిజ్లో కుక్కేస్తుంటారు. దీనివల్ల ఫ్రీజ్ చూడటానికి శుభ్రంగా కనిపించదు. అందుకే స్టోర్ బ్యాగ్స్, బ్యాక్సులు, ఫ్రిజ్ మార్కెట్లు ఉపయోగించటం వల్ల, ఫ్రిజ్ నీటుగా కనిపిస్తుంది. కావాల్సినప్పుడు ఆహార పదార్థాలను కూడా ఈజీగా తీసుకోవచ్చు. వంట గదిలో డస్ట్ బిన్ కు వాడుతున్నట్లయితే దీనిని ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసుకొని, ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దీనికి కవర్ ఉపయోగించాలి.