వాట్.. ఆ నొప్పి కూడా గుండెపోటుకు మూల కారణమా?.. నిధులు ఏం చెబుతున్నారంటే..!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి హాట్ ఫైన్ అనేది ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ పెయిన్ వచ్చి చాలామంది చనిపోయిన సంగతి కూడా తెలిసిందే. గుండెపోటు జబ్బుతో చాలామంది బాధపడుతున్న సంగతి కూడా తెలిసిందే. నేడు వేగంగా మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు గుండెపోటు అనేది వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. చెదిరిన దినచర్య, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా గుండె పోటు ప్రమాదం చాలా రేట్లు పెరుగుతుంది అంటున్నారు వైద్య నిపుణులు.
కొన్నిసార్లు వెన్నునొప్పి వంటి శరీరంలోని ఇతర భాగాలలో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతనంగా ఉంటుంది. మరి ఈ వెన్నునొప్పి, గుండెపోటు మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ముందుగా గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. గుండె కండరాలకి తగినంత రక్తం అందక, పని చేయటం ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. రక్తం తగినంతగా అందకపోవడానికి ప్రధాన కారణం సిరల్లో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ చేరడం. వయస్సు, ధూమపానం, మద్యం, మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, జన్యుపరమైన అంశాలు,
వ్యాయామం లేకపోవడం మరి నీ కారణాలని గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయిఅంటున్నారు. అందుకే దీని లక్షణాలను తెలుసుకోవడం ముఖ్యం. వెన్నునొప్పికి, గుండెపోటుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే దాని ఇతర లక్షణాలు కూడా తెలుసుకుందాం. సాధారణంగా ప్రజలు వెన్నునొప్పిని కండరాల ఒత్తిడి కారణంగా వస్తుందని భావిస్తారు. కానీ చాలా సందర్భాల్లో ఈ నొప్పి గుండెపోటు ప్రారంభ లక్షణం కూడా కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా వెన్ను పై భాగంలో నొప్పి ఉన్నప్పుడు, అది కొనసాగితే దీనిని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. ఈ నొప్పి గుండె చుట్టూ ఉన్న సిరల్లో అడ్డంకులు లేదా ఒత్తిడికి సంకేతనం కావచ్చు అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: