సూపర్ టేస్టీ ఆలూ మంచూరియా తయారీ విధానం..!
అర చెంచా కారం, అల్లం ముద్ద, సగం టీస్పూన్ ఉప్పు, డిప్ ఫ్రై కి సరిపడా నూనె. నాలుగు చెంచాల నూనె, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాల టమాటా సాస్, 2 చెంచాల నూనె, 2 చెంచాల ఉల్లిగడ్డల తరుగు, వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా మిరియాల పొడి సన్నటి మొక్కల తరుగు, 1 చెంచా సోయాసాస్. ముందుగా ఆలూ పైన పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక పాత్రలో వాటర్ పోసి అందులో సాల్ట్ వేసి ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాకూడదు. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, అల్లం ముద్ద, మైదా, కారం, ఉప్పు వేసి హాట్ వాటర్ పోసుకోవాలి. బజ్జీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. మీడియం ఫ్లో లో ఉంచండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలని మైదా విశ్రమంలో ముంచి ఆయిల్ లో వెయ్యండి. గోల్డ్ కలర్ లోకి వచ్చాక తీసి ఓ బబుల్ లో పెట్టండి. తరువాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచి... అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, ఉల్లిగడ్డలు వేసి 10 నిమిషాలు అయ్యాక టమాటా సాస్, మిరియాల పొడి, సాల్ట్, సోయా సాస్ వేసి కలపండి. తరువాత 2 స్పూన్స్ వాటర్ కార్న్ ఫ్లోర్ తో కలిపి ఉడుకుతున్న సాస్ లో వెయ్యండి. 5 నిమిషాలయ్యాక పక్కకు పెట్టుకున్నా బంగాళాదుంపల్ని అందులో కలపాలి. లాస్ట్ లో తరిగిన ఉల్లిగడ్డలను వేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలు మంచూరియా రెడీ.