హోటళ్లపైనే బతికేస్తున్న జనం.. ఇంట్లో వంట తగ్గించేశారుగా?

స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఫుడ్ సర్వీసింగ్ యాప్స్ మొదలు పెట్టినప్పుడు ఇటువంటివి ఇండియాలో ఎలా నడుస్తాయి అని ఆలోచించిన వారు ఎందరో. అయితే ఇప్పుడు రోజులో కనీసం ఒక్కసారైనా ఈ ఫుడ్ ఆప్స్ నుంచి భోజనాలు తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంత మంది భవిష్యత్తులో మన భోజన శైలిపై పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరైతే మూడు పూటలా హోటల్లోనే తింటారేమో.. 2030 నాటికి భారత దేశంలో వంట గదులకు తాళాలు వేస్తారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం అనుమానాలు మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్ లోనే సుమారు 74807 రెస్టారెంట్లు ఉన్నాయంటే ఆలోచించండి. వీటితో పాటు క్లౌడ్ కిచెన్ లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక కర్నీ పాయింట్స్ విషయానికొస్తే వీధికి ఒకటి ఉంది. అయినా వాటి బిజినెస్ బ్రహ్మాండంగా కొనసాగుతుంది.

వీటన్నింటిని బట్టి చూస్తే ఇంట్లో వండుకునే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. దేశ వ్యాప్తంగా ఏటా కేవలం బిర్యాటీలో మార్కెట్ 20 వేల నుంచి 30 వేల కోట్ల వరకు ఉంటుంది. సెకెన్ కు రెండు నుంచి మూడు బిర్యానీలు ఆర్డర్లు ఆన్ లైన్ ఫుడ్ యాప్స్ లో రావడం సర్వసాధారణం అయింది.

దీంతో పాటు భారతదేశలోని ముంబయి, బెంగళూరు, పుణె, దిల్లీ కోల్ కతా, హైదరాబాద్ తో పాటు పలు ప్రధాన నగరాల్లో భోజనాలకు హోటళ్ల మీదనే ఆధారపడుతున్నారని ఓ సర్వే తెలిపింది.  ముంబయిలో దాల్ కిచిడీ ఆఫ్ పిజ్జా, దిల్లీలో మెగ్ అలూ టిక్కీ బర్గర్, ఎగ్ పఫ్, బెంగళూరులో మసాలా దోసె, కోల్ కతాలో చికెన్, మటన్ బిర్యానీ లను భోజనం టైంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. 2030 నాటికి దేశంలో ఆహార మార్కెట్ రూ.9 లక్షల కోట్లకు చేరనుందని అంచనా. ప్రస్తుతం రూ.5.50 లక్షల కోట్లు. అంటే మన సంపాదన మొత్తంలో సింహ భాగాన్ని బయటి తిండికే ఖర్చు పెడుతున్నాం. మన ఆరోగ్యం మనం తినే ఆహారంలోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: