కాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే ప్రయోజనమా? హానికరమా?

lakhmi saranya
వేసవికాలంలో ఎక్కువగా ఉపయోగించే సబ్జా గింజల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. వీటిది పురాతన కాలం నుంచి ఆహారంలో చేర్చుకుంటూ వస్తున్నారు. సాంప్రదాయ వైద్యంలో కూడా వీటిని వాడుతారు. వీటిల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయాన్నే సబ్జా నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది కూడా. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కడుపులో ఉండే యాసిడ్ అండ్ గ్యాస్ సమస్యలు నివారమవుతాయి.
కడుపు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇక సబ్జా గింజల్లోని ఫైబర్ అండ్ జీర్ణక్రియ కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రించేలా చేస్తుంది. ఏదో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది కూడా. ఖాళీ పొట్టతో తాగడం వల్ల డయాబెటిస్ నిర్వహణకు కీలకమైన గ్లూకోజ్ ఒకేసారి విడుదలవుతుంది. సబ్జా గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. ఇలా చేయడం వల్ల ఆ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ గింజలను నీటిలో కలిపి తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. మధుమేహం వంటి సమస్యలతో బాధపడేవారు సబ్యా నీటిని తాగడం ద్వారా విముక్తి పొందవచ్చు. సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడేందుకు సహాయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సబ్జా గింజలు గుండెపోటును నియంత్రించడంలో మరియు రక్తాన్ని గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తాయి. వివిధ గుండె ప్రయోగాలను కూడా ఇది నియంత్రిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సబ్జా నేటిని ప్రతి రోజు పడగడుపున మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి. ఇక ఎండాకాలంలో అయితే వీటిని చాలా ఎక్కువగా తాగడం మంచిది. వీటిని తాగడం వల్ల బాడీకి అనేక పోషకాలు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: