రంజాన్ ఉపవాసం తరువాత తినే ఖర్జూరాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Divya
రంజాన్ మాసం ముస్లిమ్స్ లకు చాలా పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు.ఈ మాసంలో చాలామంది ముస్లిమ్స్ ఉపవాస దీక్షలను చేస్తుంటారు.ఈ ఉపవాస దీక్ష ఆచరించి ఖర్జూరాలతో విరమిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఖర్జూరాలకు తక్షణ శక్తిని ఇచ్చే గుణం ఉంటుంది కనుక.వీటిని తరచూ తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని పొందడమే కాక,చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు ఆహారనిపుణులు. మరి అవేంటో చూద్దాం పదండి..
ఖర్జురంలో ఐరన్,విటమిన్ ఏ,క్యాల్షియం,మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు పుష్కళంగా లభిస్తాయి. ఇందులోని క్యాల్షియం ఎముకలను,దంతాలను,గోర్లను దృఢంగా ఉంచడానికి,మరియు కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి,మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఖర్జూరాలను పిల్లలకు రోజుకు రెండు చొప్పున ఇవ్వడంతో,ఇందులో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.దానితో వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.ఈ పండ్లను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కూడా.అంతేకాక ఈ పండ్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ,తమ వంతు పాత్ర పోషిస్తాయి.గర్భిణీ స్త్రీలకు ఖర్జురలను వారి డైట్ లో ఉంచడంతో విటమిన్ b6 పుష్కలంగా అంది,బిడ్డ పెరుగుదల లోపం,సుఖప్రసవం కాకపోవడం,రక్తహీనత వంటి సమస్యలు దరి చేరవు.
కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తప్పకుండా తినాలి.కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం,మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలుంటాయి.ఇవన్నీ ఖర్జూరం తినడంతో పోగొట్టుకొనే అవకాశం ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
మలబద్ధకం,గ్యాస్,అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు మూడు లేదా నాలుగు ఖర్జూరాల్ని తీసుకొని, కడిగిన తర్వాత రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని టిని,ఆ తర్వాత ఆ నీటిని  తాగితే మంచి ఫలితం లభిస్తుంది.
ఇందులో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. కనుక ఖర్జూరాలు తినడం వల్ల హార్ట్ బీట్,రక్తపోటు అదుపులో ఉంచుతుంది.దీనితో పాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.మరియు నీరసం,అస్తమానము అలసటతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఆహారం.
కావున ప్రతి ఒక్కరూ వారి రోజు వారి డైట్ లో చేర్చుకోవడంతో,ఇన్ని ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు.మరియు చాలా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: