పొద్దున్నే ఈ డ్రింక్ తాగితే ఎనలేని శక్తి మీ సొంతం?

Purushottham Vinay
మన భారత దేశంలో పూర్వ కాలం నుంచి కూడా తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో హిందూ మతపరంగా తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇందులోని ఆయుర్వేద లక్షణాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.అందుకే పొద్దు పొద్దున్నే ఆరోగ్యానికి హాని చేసే టీకి బదులుగా తులసి నీటిని తాగాలని ఆరోగ్యం నిపుణులు చెబుతుంటారు. ఇంకా అంతేకాకుండా తులసి ఆకులతో టీ చేసుకొని కూడా తాగుతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా అంతేందుకు తులసిలోని మంచి గుణాల కారణంగానే, గుడిలో తులసి ఆకులతో చేసిన తీర్థాన్ని ఇస్తుంటారు.ఇక ఈ తులసి నీటితో కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..తులసి నీళ్లను తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ తొలగిపోతాయి. అందుకే ఉదయం లేవగానే పడగడుపున తులసి నీటిని తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు.మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. తులసి నీటిని తీసుకోవడం వల్ల మానసికంగా విశ్రాంతి లభిస్తుంది.


అంతేకాకుండా ప్రతీరోజూ రెండు తులసి ఆకులను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.తులసిలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. డయాబెటిస్‌ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది, అయితే తులసిలో హైపోగ్లైసీమిక్‌గా ఉండడం వల్ల చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి జీర్ణక్రియను నియంత్రిస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే తులసి నీరు మీ జీర్ణవ్యవస్థకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. పొద్దున్నే తులసి నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఈ యాంటీ-మైక్రోబయల్ ఎలిమెంట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: