ఏంటీ.. మన దేశంలో కుక్క మాంసం తింటారా.. ఎక్కడో తెలుసా?

praveen
సాధారణంగా విశ్వాసానికి మారుపేరైన జీవి ఏది అంటే కుక్క పేరు చెబుతూ ఉంటారు  ఎందుకంటే ఇప్పటినుంచి కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా మనుషులకి కుక్కలకి మధ్య బలమైన బంధం ఉంది. ఒకప్పుడు ఏకంగా కుక్కల్ని కేవలం ఇంటి బయట కాపాలాగా మాత్రమే ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఎంతో ఇష్టంగా కుక్కలను తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటూ ఇంట్లో మనిషిలాగే ప్రేమగా చూసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఏకంగా వారు తినకపోయినా పర్వాలేదు. కానీ ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కకు మాత్రం మంచి ఫుడ్ పెట్టడానికి ఎంతో మంది జంతు ప్రేమికులు కూడా ఇష్టపడుతూ ఉంటారు.

 అంతేకాకుండా ఇటీవల కాలంలో కుక్కలను పెంచుకోవడం ట్రెండ్ గా కూడా మారిపోయింది అని చెప్పాలి. అది సరేగాని ఇప్పుడు కుక్కల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. ఇటీవలే దక్షిణ కొరియాలో కుక్కల మాంసాన్ని తినడంపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాంకయ్యారు. కుక్కలను ప్రేమగా పెంచుకుంటారు అని తెలుసు. కానీ ఇలా అదే కుక్కలను చంపి చివరికి వండుకొని తింటారు అని మాత్రం ఇప్పటివరకు తెలియదు అని కొంతమంది చర్చించుకుంటున్నారు. అసలు కుక్క మాంసం మనుషులు తింటారా అనే సందేహం కూడా చాలా మందికి కలిగింది.

 కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే ఇలా కుక్కలు మాంసం తింటారేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దక్షిణ కొరియా మాత్రమే కాదు చాలా దేశాల ప్రజలు కుక్కల మాంసాన్ని ఇష్టంగా తింటారు. చైనా, పిలిపిన్స్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియాలో కుక్కల మాంసం అనేది అక్కడి ప్రజల ఆహారంలో ఒక భాగంగా మారిపోయింది. దీంతో అక్కడ కుక్కల దొంగతనాలు తరచూ జరుగుతూ ఉంటాయి.  ఇక మన దేశంలో నాగాలాండ్ లో కూడా ఇలా కుక్కల మాంసం తింటారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: