ఉడికించిన కూరగాయల కన్నా ఈ పచ్చి కూరగాయలె మిన్నా..!
క్యారట్..
క్యారెట్ ని ఉడికించి తినడం కన్నా,పచ్చివే తినడం వల్ల, విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.క్యారెట్ ఉడికించినప్పుడు ఇందులోనే విటమిన్స్ మరియు మినరల్స్ నశించిపోతాయి.కావున క్యారెట్ పచ్చివే తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.వీటిని పచ్చివే తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
క్యాప్సికం..
క్యాప్సికం ఉడికించి తినడం కన్నా,పచ్చివే తీసుకోవడం వల్ల ఇందులోనే ఆంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా లభించి,ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి.కానీ వీటిని ఉడికించి తినడానికే చాలామంది మొగ్గు చూపుతూ ఉంటారు.దీనివల్ల ఇందులోని పోషకాలన్నీ నశించిపోతాయి.
కెలరీ..
కెలరీని పచ్చిగా తీసుకోవడం వల్ల లోని విటమిన్ సి, విటమిన్ కె,పొటాషియం,మాంగనీస్ పుష్కలంగా లభించి,బోన్ హెల్త్ ను కాపాడుతాయి.అంతేకాక శరీరం హైడ్రెటెడ్ గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.కావునా కెలరీని స్నాక్ ఐటమ్ లో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.
ముల్లంగి..
పచ్చి ముల్లంగిని తీసుకోవడం వల్ల,ఇందులోని ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా లభించి,జీర్ణాశయ సమస్యలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.వీటిని ఉడికించినప్పుడు ఇందులోని సుగుణాలన్ని నాశనం అవుతాయి.కావున వీటిని పచ్చిగా తినడమే ఉత్తమం.
బ్రకోలి..
బ్రకోలి మరియు క్యాబేజి కుటుంబానికి చెందిన కూరగాయలలో విటమిన్ ఏ మరియు సి,అధిక ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.వీటిని ఉడికించి తిన్నప్పుడు ఇవి నశిస్తాయి.కావున వీటిని పచ్చిగా తినడమే మంచిది.ఈ కూరగాయలను పచ్చిగా తినడం వల్ల డైజెస్టివ్ సిస్టం ని మెరుగుపరుస్తుంది.