కూలింగ్ గ్లాసెస్ ఎలా పుట్టాయి.. స్టోరీ ఏంటో తెలుసా?

praveen
కూలింగ్ గ్లాసెస్ నేటి రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఇవి భాగం అయిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా కూలింగ్ గ్లాసెస్ ధరిస్తూ ఉన్నారు. కొంతమంది స్టైల్ గా ఉంటుందని కూలింగ్ గ్లాసెస్ ధరిస్తూ ఉంటే మరి కొంతమంది ఎండ వేడిమి కళ్ళకు తగలకుండా ఉండేందుకు కూలింగ్ గ్లాసెస్ ని ధరిస్తున్నారు  అని చెప్పాలి. ఇక ఈ గ్లాస్సెస్ పెట్టుకున్నామంటే చాలు మండుటెండల్లో కూడా అంతా ప్రశాంతంగా ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా నేటి రోజుల్లో అందరి జీవితాల్లో భాగమై పోయిన కూలింగ్ గ్లాసెస్ ఆవిష్కరణ ఎలా జరిగింది అన్నది మాత్రం చాలామందికి తెలియదు.



 సన్ గ్లాసెస్ ను 12వ శతాబ్దంలో చైనాలో తొలిసారిగా తయారు చేశారట. సూర్యకిరణాలను అడ్డుకుంటూ ఎంతో గొప్పగా పనిచేసేలా వీటిని రూపొందించారు. ఇక మిగితా గ్లాసెస్ తో పోల్చి చూస్తే అటు సన్ గ్లాసెస్ ఫ్రేమ్ కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. ఇక తొలినాళ్లల్లో చైనీస్ న్యాయమూర్తులు మాత్రమే వీటిని ఎక్కువగా ఉపయోగించేవారట. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి హావభావాలు కళ్ళల్లో కనిపించకుండా ఈ సన్ గ్లాసెస్ ఉపయోగించేవారు అన్న టాక్ కూడా ఉంది. 12వ శతాబ్దంలో తయారుచేసిన ఇక ఇవి ఎక్కువగా వాడకలోకి వచ్చింది మాత్రం 20వ శతాబ్దంలోనేనట.


 20వ శతాబ్దం నుంచి ఇక ఈ సన్ గ్లాసెస్ ఫ్యాషన్ గా మారిపోయాయి. 18వ శతాబ్దంలో జేమ్స్ ఐస్ కాఫ్ అనే వ్యక్తి కళ్ళద్దాల కటకాలకు రంగులను జోడించి తయారు చేశారట. ఇవి కంటి చూపును కూడా కాపాడతాయని వారు చెబుతూ ఉంటారు. 20 శతాబ్దంలో మార్కెట్లోకి చలవ కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చేసాయి. 1929 నాటికి సామ్ పోస్టర్ అనే కంపెనీ పెద్ద ఎత్తున ఈ కళ్లద్దాల ఉత్పత్తిని ప్రారంభించింది.1930 నాటికి అందరికీ ఈ చలవ కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయ్. ఇక రెండవ ప్రపంచం యుద్ధం నాటికి ఏవియేటర్ యాంటీ గ్లేర్ గ్లాసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. 1970 వరకు ప్రపంచమంతా ఈ చలవ కళ్లద్దాలకు ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: