బాల భారతం : పగడవు దీవులా అవెలా ఉంటాయ్ ?
చందమామ కథలో పగడపు దీవులు ఉంటాయి. అవి ఊహకు ఉదాహరణగా ఉంటాయి. ఊహాలోకాలు అని అంటామే అవే ఇవి. పగడపు దీవులు రెక్కల గుర్రాలు ఒంటి కన్ను రాక్షసుడు మాయల మాంత్రికుడు మాటలు నేర్చిన చిలక ఇంకా ఇంకెన్నో ఇవన్నీ మన కథల్లో పాత్రలు మన జీవితాల్లో పాత్రలు కానీ ఇప్పుడు అవి లేవు. ఉండవు కూడా! మనకొక యానిమేటెడ్ వరల్డ్ కావాలి. అదే ప్రపంచం అనుకుంటాం. మనకొక వర్చువల్ రియాలటీ అన్నది కావాలి. అదే మన లోకం అనుకుంటాం.మనకు ఆధారం గా తోచినవేవీ అక్కర్లేదు. మన ఫాంటసీ మన యుద్ధ కథ మన అక్బర్ బీర్బల్ కథ మన మర్యాద రామన్న, మన పంచతంత్ర కథలు, మన పరమానందయ్య కథలు ఇవేవీ అక్కర్లేదండి. ఏం కాదు ఇవేవీ నేర్పకుండానే మీ పిల్లలను పెద్దాళ్లను చేయండి. ఏం కాదు ఇవేవీ నేర్పకుండానే నీతి చంద్రికలు అందించకుండానే మీ పిల్లలను ఐఏఎస్ లు చేయండి. ఏం కాదు వాళ్లకు ఎవరేంటో ఎందుకో తెలియకుండానే జీవితం అర్థం అందకుండానే కాలం గడిచిపోతుంది. ఇలాంటి దౌర్భాగ్యం మన బాల్యానిది దీనిని ఎవ్వరూ ఏమీ అనవద్దండి.