నిరుపేదలకు దేవుళ్లు.. ఈ నిస్వార్థ సేవకులు..?

ప్రభుత్వ ఆసుపత్రులు.. అనారోగ్యంతో ఇబ్బంది పడే పేదలకు దేవాలయాలు.. ఇక్కడకు వచ్చే వారంతా నిరుపేదలే.. లక్షలు, వేలు ఖర్చు చేసి జబ్బులు నయం చేసుకోలేని వాళ్లే ఎక్కువగా ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారు. అలాంటి వారు ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే.. రోగుల కుటుంబీకులు, సహాయకులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడో ఓ మూలన తలదాచుకున్నా.. తినేందుకు సరైన తిండి దొరకదు..అంతంత ఖరీదు పెట్టి భోజనం చేయలేరు.

ఇలాంటి వారి ఇబ్బందులు గమనించింది ఓ స్వచ్ఛంద సంస్థ.. హైదరాబాద్‌లోని నిమ్స్, ఈఎస్‌ఐ వంటి ఆస్పత్రుల వద్ద రోగులకు, వారి బంధువుల ఆకలి బాధలు తీరుస్తోంది. హైదరాబాద్‌లో ఏ ఒక్కరూ ఆకలిగా ఉండకూడదనే ధ్వేయంతో పని చేస్తున్న ఈ సంస్థ పేరు నిస్వార్థ్‌ సహయోగ్. {{RelevantDataTitle}}