తవ్వకాల్లో బయటపడ్డ పురాతన.. మద్యం ఫ్యాక్టరీ.. !

పురావస్తు శాఖవారు భూమిలో దాగి ఉన్న ఎన్నో చారిత్రాత్మక విషయాలను వెలికి తీస్తూ ఉంటారు. వాటి ద్వారా ఆయా ప్రాంతాల లో చారిత్రాత్మక విషయాలను తెలుసుకొని, వాటిని భావితరాలకు ప్రదర్శన కోసం ఉంచుతారు. కొన్ని సార్లు ఇలాంటివి ప్రమాదకరమైనప్పటికీ ఈ రంగంలో ఉత్సాహం ఉన్న వారి కృషితో ఆయా విషయాలు మళ్ళీ వెలుగు చూస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో విషయాలను వెలుగులోకి తేవడంలో పురావస్తు శాఖవారు విజయం సాధించారు. అయితే కొన్ని సార్లు సాధారణ తవ్వకాలలో కూడా ఇలాంటి సంపద బయటపడుతూనే ఉంటుంది. దానిని వారు పురావస్తు శాఖకు అప్పగించడం వలన వారు దానిపై పరిశోధనలు జరిపి అవి ఏ కాలానివో తెలుసుకుంటారు.  
ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉంది. తాజాగా ఇలాంటి తవ్వకాలు ఇజ్రాయెల్ లో జరిగినప్పుడు అక్కడ పురాతన కాలంలో ఏర్పాటు చేసుకున్న మద్యం ఫ్యాక్టరీ ఒకటి బయటపడింది. అంటే అప్పట్లో కూడా మద్యం తయారుచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పటి టెక్నాలజీ, ఇప్పటి టెక్నాలజీ పూర్తిగా వేరుగా ఉన్నప్పటికీ శాస్త్రీయ పద్దతి అంటే ఆనాటిదే అని చెప్పక తప్పదు. అప్పట్లో అన్ని రాళ్లతోనే చేయడం జరిగిందని ఆ చిత్రం చూస్తుంటే తెలుస్తుంది. ఈ తవ్వకాలలో గ్రీకు చక్రవర్తి బైజంటైన్ కాలం నాటి మద్యం తయారీ కేంద్రం కనుగొన్నారు. టెల్ అవీన్ కు దక్షిణంగా ఉన్న యువానే పట్టణం సమీపంలో దీనిని గుర్తించారు. గత రెండేళ్లుగా ఇక్కడ జరుగుతున్నా తవ్వకాలలో ఇటీవలే ఇది కనిపించింది అని పరిశోధకులు తెలిపారు.
దీనిని సుమారు 1500 ఏళ్ళనాటిదని, ఇక్కడ భారీగా మద్యం తయారీ చేసేందుకే ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని పరిశోధకులు వెల్లడించారు. ఇక్కడ మొత్తం ఐదు మద్యం తయారీ యూనిట్లు, గిడ్డంగులు, మట్టి పాత్రలు నిల్వ ఉంచే బట్టీలు, వేలసంఖ్యలో జాడీలు, వాటి శాఖలాలు ఉన్నట్టు వారు తెలిపారు. వీటిని బట్టి ఇక్కడ 5.2 లక్షల గ్యాలన్లకు పైగా మద్యం తయారీ చేసి ఉండవచ్చు అని వాళ్ళు తెలిపారు. ఇప్పటి వరకు దొరికిన ఇలాంటి అవశేషాలలో ఇదే అతి పెద్ద మద్యం తయారీ కేంద్రం అని వారు పేర్కొన్నారు.  ప్రపంచం లోనే ఇది అతి పెద్ద కేంద్రం గా వారు పేర్కొన్నారు. అంటే 1500 ఏళ్ళ క్రితం ఈ పట్టణం ప్రపంచానికి మద్యం తయారీ కేంద్రంగా  ఉండి ఉండవచ్చని వారు తెలిపారు. అప్పట్లో ఈ పట్టణం అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుందని ఇజ్రాయెల్ పురావస్తు శాఖ చెపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: