సెల్ఫీ అంటే అభిమానం కాదండోయ్

సాంకేతిక ప్రపంచంలో చాలా మందికి ఉన్న అలవాటు సెల్ఫీ దిగడం. ఈ అలవాటులో పడి ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా రోజు చూడాల్సి వస్తుంది. అంతగా సాంకేతికత ప్రస్తుత తరాలను ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్ని సార్లు ఎవరైనా మనతో సెల్ఫీ అంటే అది అభిమానం అనుకుంటే మంచిది కాదు, దానిని వారు అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. సాంకేతికతను కొందరు మంచి కోసం వాడుకుంటుంటే మరి కొందరు మాత్రం స్వార్దానికి లేదా నేరాలు చేయడానికే వాడుకుంటున్నారు.
తాజాగా బెంగుళూరు లో కూడా ఒక మహిళ తన స్నేహితురాలిని చూడాలని వేరే ఊరి నుండి సిటీకి వచ్చింది. తన ఇంటికి వెళ్లే ఉద్దేశ్యంతో క్యాబ్ బుక్ చేసుకుంది. అంతటితో అలిసిపోయిన ఆమె క్యాబ్ లో కూర్చోగానే నిద్ర ముంచుకొచ్చింది. క్యాబ్ డ్రైవర్ కూడా ఆమె చెప్పిన చోటుకు చేరుకోగానే వాహనం ఆపి ఆమెను దిగమని డోర్ తీశాడు. అప్పుడు ఆమె గాఢనిద్రలో ఉండటంతో క్యాబ్ డ్రైవర్ పిలుపు వినిపించుకోలేదు. అదే అదునుగా భావించిన ఆ డ్రైవర్ ఆమెను నిద్ర లేపకుండా మళ్ళీ బండి తీసి నెమ్మదిగా నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఎవరు లేని ప్రాంతం రాగానే అక్కడ వాహనం ఆపి ఆమె దగ్గరగా చేరి సెల్ఫీ దిగాడు. అంతట ఆమె ఇంకా నిద్రలో ఉండటాన్ని గమనించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పెనుగులాటలో ఆమెకు మెలుకువ వచ్చి జరుగుతున్న విషయం గ్రహించి స్పందించే సరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అయినా తమాయించుకొని ఓపిక కూడగట్టుకొని అతడిని పక్కకు నెట్టి జనారణ్యం వైపు పరుగుపెట్టింది. మెల్లిగా పోలీస్ స్టేషన్ కు చేరింది. అప్పటికే ఆమె ఆ డ్రైవర్ మొబైల్ తీసుకోవడంతో దానిని అధికారులకు ఇచ్చి తనకు జరిగినదానిని చెప్పి పిర్యాదు నమోదు చేసింది. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి హత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకున్న అధికారులు సదరు డ్రైవర్ కోసం గాలింపు చేపడుతున్నారు. ఒక్కోసారి జీవితంలో నమ్మిన వారు ఇలా చేస్తుండటం వలన కొన్ని వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతుంది, కానీ అది సిటీ అంతకంటే మంచి రవాణా వ్యవస్థ లేకపోవడంతో మరో దారిలేక ఇలాంటివారిని ఆశ్రయిస్తే వాళ్ళు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: